Imdaru buddulu seppe dimdaamkaane

ఇందరు బుద్దులు చెప్పే దిందాఁకానే
Language

(॥పల్లవి॥)
ఇందరు బుద్దులు చెప్పే దిందాఁకానే
కందువఁ గూడితి రిదె కాఁక లిందాఁకానే

(॥ఇంద॥)
యేఁటి కిఁకి మాఁటలు యెదురైతి రిద్దరు
గాఁటపుటలుకలు దగ్గరుదాఁకే
నాఁటెఁ దొల్లె మోహము నవ్వులఁ బొద్దు గడప
చోటులేదు చలములు సోఁకినందాఁకానే

(॥ఇంద॥)
వొద్దు వొద్దు కొసరులు వొక్కటైతి రిద్దరును
సుద్దులెల్లా మేనులు సుక్కుకాఁకానే
కొద్దిమాలె కోరికెలు కొంకులుఁగొసరు లిఁక
పొద్దు లేదు పంతములు పొందినందాఁకానే

(॥ఇంద॥)
చాలు చాలు సిగ్గులు సమ్మతైతి రిద్దరును
తేలింపులన్నియు మీలో తేరుదాఁకానే
ఆలరి శ్రీవేంకటేశ అలమేలుమంగానీవు
వేళతోఁగూడితిరి యీవేడుకౌదాఁకానే

(||pallavi||)
iṁdaru buddulu sĕppe diṁdām̐kāne
kaṁduvam̐ gūḍidi ridĕ kām̐ka liṁdām̐kāne

(||iṁda||)
yem̐ṭi kim̐ki mām̐ṭalu yĕduraidi riddaru
gām̐ṭabuḍalugalu daggarudām̐ke
nām̐ṭĕm̐ dŏllĕ mohamu navvulam̐ bŏddu gaḍaba
soḍuledu salamulu som̐kinaṁdām̐kāne

(||iṁda||)
vŏddu vŏddu kŏsarulu vŏkkaḍaidi riddarunu
suddulĕllā menulu sukkugām̐kāne
kŏddimālĕ korigĕlu kŏṁkulum̐gŏsaru lim̐ka
pŏddu ledu paṁtamulu pŏṁdinaṁdām̐kāne

(||iṁda||)
sālu sālu siggulu sammadaidi riddarunu
teliṁpulanniyu mīlo terudām̐kāne
ālari śhrīveṁkaḍeśha alamelumaṁgānīvu
veḽadom̐gūḍidiri yīveḍugaudām̐kāne