ఇందరూ జీవులే యెంచి చూచితే
(॥పల్లవి॥)
ఇందరూ జీవులే యెంచి చూచితే-
నందులో భావము లవియే వేరు
(॥ఇంద॥)
అంతటఁ జూచిన యాహారనిద్రలు
జంతురాసులకు సహజములు
సంతోషంబును సాత్వికగుణమును
శాంతచిత్తులకు సహజములు
(॥ఇంద॥)
మనసునఁగల కామక్రోధంబులు
జననశీలులకు సహజములు
వినయంబును ఘనవిజ్ఞానము స-
జ్జనుల కెపుడును సహజములు
(॥ఇంద॥)
విడువని యాసలు వేవేలు చింతలు
జడులకు నం(నెం ?) దును సహజములు
బడి శ్రీవేంకటపతి కొలువుఁ దపము
జడియని దాసుల సహజములు
(||pallavi||)
iṁdarū jīvule yĕṁchi sūside-
naṁdulo bhāvamu laviye veru
(||iṁda||)
aṁtaḍam̐ jūsina yāhāranidralu
jaṁturāsulagu sahajamulu
saṁtoṣhaṁbunu sātvigaguṇamunu
śhāṁtasittulagu sahajamulu
(||iṁda||)
manasunam̐gala kāmakrodhaṁbulu
jananaśhīlulagu sahajamulu
vinayaṁbunu ghanavijñānamu sa-
jjanula kĕbuḍunu sahajamulu
(||iṁda||)
viḍuvani yāsalu vevelu siṁtalu
jaḍulagu naṁ(nĕṁ ?) dunu sahajamulu
baḍi śhrīveṁkaḍabadi kŏluvum̐ dabamu
jaḍiyani dāsula sahajamulu