Imdarivamtidaananaa yichchaguraalanu nenu

ఇందరివంటిదాననా యిచ్చకురాలను నేను
Language

(॥పల్లవి॥)
ఇందరివంటిదాననా యిచ్చకురాలను నేను
పొందుపఱచితే వలపులు చెప్పనేల

(॥ఇందరి॥)
కూరిమిగలవిభుఁడేకొలఁది మెలఁగినాను
నేరము లెంచవచ్చునా నెలఁతలకు
గారవించి మన్నించినకందువే చూచుట గాక
తారుకాణకుఁ దీసితే తగవే మున్నది

(॥ఇందరి॥)
కైవమయినవాఁ డేకరణి నేలినాను
ఆవేళఁ గొసరుదురా ఆసోదాలకు
వానితోఁ బెండ్లాడినవరుసే చూచుట గాక
చేవమీర దొరకొంటే సిగ్గు లే మున్నవి

(॥ఇందరి॥)
నిచ్చలు శ్రీవేంకటేశ నీ వెంత గూడినాను
పచ్చిసేయవచ్చునా పలుమారును
ఇచ్చట నీవు సేసినయితవే చూచుట గాక
కొచ్చి బలిమి సేసితే గుట్టు మరే మున్నది

(||pallavi||)
iṁdarivaṁṭidānanā yichchagurālanu nenu
pŏṁdubaṟaside valabulu sĕppanela

(||iṁdari||)
kūrimigalavibhum̐ḍegŏlam̐di mĕlam̐ginānu
neramu lĕṁchavachchunā nĕlam̐talagu
gāraviṁchi manniṁchinagaṁduve sūsuḍa gāga
tārugāṇagum̐ dīside tagave munnadi

(||iṁdari||)
kaivamayinavām̐ ḍegaraṇi nelinānu
āveḽam̐ gŏsarudurā āsodālagu
vānidom̐ bĕṁḍlāḍinavaruse sūsuḍa gāga
sevamīra dŏragŏṁṭe siggu le munnavi

(||iṁdari||)
nichchalu śhrīveṁkaḍeśha nī vĕṁta gūḍinānu
pachchiseyavachchunā palumārunu
ichchaḍa nīvu sesinayidave sūsuḍa gāga
kŏchchi balimi seside guṭṭu mare munnadi