ఇందరివలెనా నీ యిల్లాల నేను
(॥పల్లవి॥)
ఇందరివలెనా నీ యిల్లాల నేను
కుంది నీవు తలవంచుకోకుమీ ఇఁకను
(॥ఇంద॥)
నీ మనసే పట్టి నేను నెరవేరుదుఁగాని
కైమీరి చేఁతలు సేసి గయ్యాళించను
మోమోటాన నీకు నే మొక్కులే మొక్కుదుఁగాని
వాములైన పంతాలను వాఁటాలు సేయను
(॥ఇంద॥)
యెంత సేసినా నీకు నిచ్చకమాడుదుఁగాని
వింతవారివలె నీపై వేగిరించను
మంతనాన మరి నేను మనవి చెప్పుదుఁగాని
కొంతము లెగరవేసి గురులు సేయను
(॥ఇంద॥)
చనవు సేసుక మోవిచవులు నేఁ జూతుఁగాని
వెనకటి సుద్దులకు వెంగెమాడను
ఘనుఁడ శ్రీ వేంకటేశ కలసితి మిద్దరము
పనులెల్లాఁ జూపి నిన్నుఁ బైపై ఱట్టు సేయను
(||pallavi||)
iṁdarivalĕnā nī yillāla nenu
kuṁdi nīvu talavaṁchugogumī im̐kanu
(||iṁda||)
nī manase paṭṭi nenu nĕraverudum̐gāni
kaimīri sem̐talu sesi gayyāḽiṁchanu
momoḍāna nīgu ne mŏkkule mŏkkudum̐gāni
vāmulaina paṁtālanu vām̐ṭālu seyanu
(||iṁda||)
yĕṁta sesinā nīgu nichchagamāḍudum̐gāni
viṁtavārivalĕ nībai vegiriṁchanu
maṁtanāna mari nenu manavi sĕppudum̐gāni
kŏṁtamu lĕgaravesi gurulu seyanu
(||iṁda||)
sanavu sesuga movisavulu nem̐ jūdum̐gāni
vĕnagaḍi suddulagu vĕṁgĕmāḍanu
ghanum̐ḍa śhrī veṁkaḍeśha kalasidi middaramu
panulĕllām̐ jūbi ninnum̐ baibai ṟaṭṭu seyanu