Imdarise naaradibo yimduvamkanu tolli

ఇందరిచే నారడిపో యిందువంకను తొల్లి
Language

(॥పల్లవి॥)
ఇందరిచే నారడిపో యిందువంకను తొల్లి
యెందరి నేఁచితివి నీ విందువంకను

(॥ఇందరి॥)
కోమలిని వలపించి గుట్టునఁ బాయఁ గ నీ
కేమి వెద్దరిక మాయ యిందువంకను
ప్రేమమునఁ జెలిచేతఁ బిలువనంపినా రావు
యేమేలు నీకుఁ జేరె యిందువంకను

(॥ఇందరి॥)
మన్ననలు చెలి కిచ్చి మరి వేరేసతిఁ దెచ్చి
యెన్ని కేమి సేసుకొంటి విందువంకను
నిన్న నేఁటి పొందు గాదు నీకు నాపెకు, నేఁడు
యెన్నరానితలపోఁతే యిందువంకను

(॥ఇందరి॥)
మంతనాన చెలిఁజేరి మాటలజోలిఁ బెట్టఁగ
నెంత నేరుపరి వైతి విందువంకను
పంతపు శ్రీవేంకటేశ వడఁతిఁ గూడఁగ వేఁ
డెంతయు నమరె నీ కిందువంకను

(||pallavi||)
iṁdarise nāraḍibo yiṁduvaṁkanu tŏlli
yĕṁdari nem̐sidivi nī viṁduvaṁkanu

(||iṁdari||)
komalini valabiṁchi guṭṭunam̐ bāyam̐ ga nī
kemi vĕddariga māya yiṁduvaṁkanu
premamunam̐ jĕlisedam̐ biluvanaṁpinā rāvu
yemelu nīgum̐ jerĕ yiṁduvaṁkanu

(||iṁdari||)
mannanalu sĕli kichchi mari veresadim̐ dĕchchi
yĕnni kemi sesugŏṁṭi viṁduvaṁkanu
ninna nem̐ṭi pŏṁdu gādu nīgu nābĕgu, nem̐ḍu
yĕnnarānidalabom̐te yiṁduvaṁkanu

(||iṁdari||)
maṁtanāna sĕlim̐jeri māḍalajolim̐ bĕṭṭam̐ga
nĕṁta nerubari vaidi viṁduvaṁkanu
paṁtabu śhrīveṁkaḍeśha vaḍam̐tim̐ gūḍam̐ga vem̐
ḍĕṁtayu namarĕ nī kiṁduvaṁkanu