ఇందరిముందరా నీవు ఇంతేసి సేసేవుగాక
(॥పల్లవి॥)
ఇందరిముందరా నీవు ఇంతేసి సేసేవుగాక
కందువ వినోదించఁగా కాదనేమా నిన్నును
(॥ఇంద॥)
మూసినముత్యమువలె ముద్దరాలుమొక్కిమొక్కి
లాసీ నీపొందులకు లాలించరాదా
ఆసపడివచ్చినాపె నాదరించితే నేము
వాసుల కెవ్వరిమైనా వద్దనేమా నిన్నును
(॥ఇంద॥)
వినయపువిత్తరాలు వేడుకతోఁ గొలువుసేయఁ
బెనఁగీ, వద్ద గూచుండఁబెట్టుకోరాదా
ననిచినయాసెను నంటున మన్నించఁగాను
కనికరించక ఇట్టె కాదనేమా నిన్నును
(॥ఇంద॥)
మానాపతిజవరాలు మరిగి కాచుకున్నది
పూని చననిచ్చి యిట్టె బొగించరాదా
యే నలమేలుమంగను యీకెను శ్రీవేంకటేశ
కానిమ్మని కూడితివి కాదనేమా నిన్నును
(||pallavi||)
iṁdarimuṁdarā nīvu iṁtesi sesevugāga
kaṁduva vinodiṁcham̐gā kādanemā ninnunu
(||iṁda||)
mūsinamutyamuvalĕ muddarālumŏkkimŏkki
lāsī nībŏṁdulagu lāliṁcharādā
āsabaḍivachchinābĕ nādariṁchide nemu
vāsula kĕvvarimainā vaddanemā ninnunu
(||iṁda||)
vinayabuvittarālu veḍugadom̐ gŏluvuseyam̐
bĕnam̐gī, vadda gūsuṁḍam̐bĕṭṭugorādā
nanisinayāsĕnu naṁṭuna manniṁcham̐gānu
kanigariṁchaga iṭṭĕ kādanemā ninnunu
(||iṁda||)
mānābadijavarālu marigi kāsugunnadi
pūni sananichchi yiṭṭĕ bŏgiṁcharādā
ye nalamelumaṁganu yīgĕnu śhrīveṁkaḍeśha
kānimmani kūḍidivi kādanemā ninnunu