Imdarilonaa neegu nemtigi rattu

ఇందరిలోనా నీకు నేఁటికి రట్టు
Language

(॥పల్లవి॥)
ఇందరిలోనా నీకు నేఁటికి రట్టు
పొందులు సేసుక అట్టె బుజ్జగించవయ్యా

(॥ఇం॥)
వీడెము చేతికిచ్చి వెలఁది నీతోనవ్వఁగ
యేడ చూచేవయ్య నీకు నెంత పరాకు
ఆడరానిమాటలాడీ నందుకే కోపగించుక
కొడెకాఁడ వాపె నిట్టె కుస్తరించవయ్యా

(॥ఇంద॥)
చేసన్న చేసి ఆపె చెనకి నిన్నుఁ జూడఁగ
యేసుద్దులు చెప్పేవయ్య ఇదె నాతోను
వాసితో నిందుకే యాపె వట్టినేరములు వేసీ
వేసాలగుట్లు మాని వేఁడుకొనవయ్యా

(॥ఇంద॥)
అలమేలుమగ నిన్ను నట్టె కాఁగిలించఁగాను
నిలుచుండే వేమయ్య నివ్వెరగుతో
అలరి శ్రీవేంకటేశ అందు కాపె వురమెక్కె
చెలి నేను; ఆపెనే చెక్కునొక్కవయ్యా

(||pallavi||)
iṁdarilonā nīgu nem̐ṭigi raṭṭu
pŏṁdulu sesuga aṭṭĕ bujjagiṁchavayyā

(||iṁ||)
vīḍĕmu sedigichchi vĕlam̐di nīdonavvam̐ga
yeḍa sūsevayya nīgu nĕṁta parāgu
āḍarānimāḍalāḍī naṁduge kobagiṁchuga
kŏḍĕgām̐ḍa vābĕ niṭṭĕ kustariṁchavayyā

(||iṁda||)
sesanna sesi ābĕ sĕnagi ninnum̐ jūḍam̐ga
yesuddulu sĕppevayya idĕ nādonu
vāsido niṁduge yābĕ vaṭṭineramulu vesī
vesālaguṭlu māni vem̐ḍugŏnavayyā

(||iṁda||)
alamelumaga ninnu naṭṭĕ kām̐giliṁcham̐gānu
nilusuṁḍe vemayya nivvĕragudo
alari śhrīveṁkaḍeśha aṁdu kābĕ vuramĕkkĕ
sĕli nenu; ābĕne sĕkkunŏkkavayyā