Imdarilo ninnu ravva limkam jesenaa

ఇందరిలో నిన్ను రవ్వ లిఁకఁ జేసేనా
Language

(॥పల్లవి॥)
ఇందరిలో నిన్ను రవ్వ లిఁకఁ జేసేనా
నిందల మాటలకుఁగా నీకేల వెఱవ

(॥ఇంద॥)
ఉద్దండాన నే నిన్ను వుప్పటించ వచ్చేనా నా-
పెద్దరికేనకే నేఁ బెనఁగేఁ గాక
చద్దికి వేఁడికి నిన్ను సాదించ వచ్చేనా
అద్దుకొన్ననాలోని మోహము చూపేఁ గాక

(॥ఇంద॥)
పైకొని నే నీమీఁద బలిమి చూప వచ్చేనా
చేకొని నీ వన్నమాట చెప్పేఁ గాక
రాకపోకలను నిన్ను రవ్వ సేసేదాననా
దీకొని నామేనవావి దెలిపేఁ గాక

(॥ఇంద॥)
కన్నుల జంకించి నిన్నుఁ గాఁగిలించే దాననా
తిన్నని నీనాసిగ్గు తీరిచేఁ గాక
యిన్నిటా శ్రీవేంకటేశ యిట్టె నన్నుఁ గూడితవి
కన్నుల నవ్వేదాననా కని మొక్కేఁ గాక

(||pallavi||)
iṁdarilo ninnu ravva lim̐kam̐ jesenā
niṁdala māḍalagum̐gā nīgela vĕṟava

(||iṁda||)
uddaṁḍāna ne ninnu vuppaḍiṁcha vachchenā nā-
pĕddarigenage nem̐ bĕnam̐gem̐ gāga
saddigi vem̐ḍigi ninnu sādiṁcha vachchenā
addugŏnnanāloni mohamu sūbem̐ gāga

(||iṁda||)
paigŏni ne nīmīm̐da balimi sūba vachchenā
segŏni nī vannamāḍa sĕppem̐ gāga
rāgabogalanu ninnu ravva sesedānanā
dīgŏni nāmenavāvi dĕlibem̐ gāga

(||iṁda||)
kannula jaṁkiṁchi ninnum̐ gām̐giliṁche dānanā
tinnani nīnāsiggu tīrisem̐ gāga
yinniḍā śhrīveṁkaḍeśha yiṭṭĕ nannum̐ gūḍidavi
kannula navvedānanā kani mŏkkem̐ gāga