Imdarilo nememdum boludumu yimdarim bolina jeevulame

ఇందరిలో నేమెందుఁ బోలుదుము యిందరిఁ బోలిన జీవులమే
Language

(॥పల్లవి॥)
ఇందరిలో నేమెందుఁ బోలుదుము యిందరిఁ బోలిన జీవులమే
కందువ వీరలఁ దలఁచి చిత్తమిది కలఁగెడి దైవమ కావఁగదే

(॥ఇంద॥)
యెందరొకో జరాదుఃఖము లేచి యనుభవించేటివారు
యెందరొకో దరిద్రదుఃఖము లెఁసగి యలమటించేటివారు
యెందరొకో బంధనతాడనహీనదెసల నుండెడివారు
యెందరొకో దాసదాస్యవిధి నెడయరాక చెఱలయినవారు

(॥ఇంద॥)
యెందరొకో మరణదెసలచే నిల సంయోగవియోగదుఃఖితులు
యెందరొకో జన్మరోగముల నెక్కువ భయమందేటివారు
యెందరొకో రాజుల చోరుల హింసలకు లోన యినవారు
యెందరొకో పొడమిన జీవుల కెక్కడ నెక్కడ నేపాటో

(॥ఇంద॥)
యెందరొకో యీదుఃఖనివృత్తికి యెడసి మిమ్ముఁ గొలిచినవారు
యెందరొకో సంపదలకు లోనై యేతాయాతనఁ బడువారు
యెందరొకో శ్రీవేంకటేశ యిపు డెక్కువ నీశరణము చొచ్చి
యిందును నందును సుఖులై లోకుల నిందరిఁ జూచుచు నవ్వెడివారు

(||pallavi||)
iṁdarilo nemĕṁdum̐ boludumu yiṁdarim̐ bolina jīvulame
kaṁduva vīralam̐ dalam̐si sittamidi kalam̐gĕḍi daivama kāvam̐gade

(||iṁda||)
yĕṁdarŏgo jarāduḥkhamu lesi yanubhaviṁcheḍivāru
yĕṁdarŏgo daridraduḥkhamu lĕm̐sagi yalamaḍiṁcheḍivāru
yĕṁdarŏgo baṁdhanadāḍanahīnadĕsala nuṁḍĕḍivāru
yĕṁdarŏgo dāsadāsyavidhi nĕḍayarāga sĕṟalayinavāru

(||iṁda||)
yĕṁdarŏgo maraṇadĕsalase nila saṁyogaviyogaduḥkhidulu
yĕṁdarŏgo janmarogamula nĕkkuva bhayamaṁdeḍivāru
yĕṁdarŏgo rājula sorula hiṁsalagu lona yinavāru
yĕṁdarŏgo pŏḍamina jīvula kĕkkaḍa nĕkkaḍa nebāḍo

(||iṁda||)
yĕṁdarŏgo yīduḥkhanivṛttigi yĕḍasi mimmum̐ gŏlisinavāru
yĕṁdarŏgo saṁpadalagu lonai yedāyādanam̐ baḍuvāru
yĕṁdarŏgo śhrīveṁkaḍeśha yibu ḍĕkkuva nīśharaṇamu sŏchchi
yiṁdunu naṁdunu sukhulai logula niṁdarim̐ jūsusu navvĕḍivāru