ఇందరిలో నీ సుద్దులు యేమిచెప్పేవు
(॥పల్లవి॥)
ఇందరిలో నీ సుద్దులు యేమిచెప్పేవు
కందువతో నేకతానఁ గరుణించరాదా
(॥ఇంద॥)
చెంగలువకన్నులను చెలి నిన్నుఁ జూచితేను
అంగమెల్ల బులకించెనని యాడేవు
యింగితాన వలపులు ఇంత నీకుఁ గలిగితే
కంగుదీర నికె నిట్టె కాఁగిలించరాదా
(॥ఇంద॥)
కప్పురపుఁబలుకులకాంత నీతో మాటాడితే
అప్పుడే నే భ్రమసితినని యాడేవు
ముప్పిరిగఁ దమకము ముందు నీకింత గలితే
కప్పి పచ్చడముతోనే కాఁగిలించరాదా
(॥ఇంద॥)
వెన్నెలనవ్వులతోడ వెలఁది నిన్నుఁ గూడితే
అన్నిటాను భ్రమసితినని యాడేవు
మన్నించి శ్రీవేంకటేశ మనసు లేకములైతే
కన్నప్పుడెల్లా నిట్టె కాఁగిలించరాదా
(||pallavi||)
iṁdarilo nī suddulu yemisĕppevu
kaṁduvado negadānam̐ garuṇiṁcharādā
(||iṁda||)
sĕṁgaluvagannulanu sĕli ninnum̐ jūsidenu
aṁgamĕlla bulagiṁchĕnani yāḍevu
yiṁgidāna valabulu iṁta nīgum̐ galigide
kaṁgudīra nigĕ niṭṭĕ kām̐giliṁcharādā
(||iṁda||)
kappurabum̐balugulagāṁta nīdo māḍāḍide
appuḍe ne bhramasidinani yāḍevu
muppirigam̐ damagamu muṁdu nīgiṁta galide
kappi pachchaḍamudone kām̐giliṁcharādā
(||iṁda||)
vĕnnĕlanavvuladoḍa vĕlam̐di ninnum̐ gūḍide
anniḍānu bhramasidinani yāḍevu
manniṁchi śhrīveṁkaḍeśha manasu legamulaide
kannappuḍĕllā niṭṭĕ kām̐giliṁcharādā