Imdarilo bigi sevu yippudelaa

ఇందరిలో బిగి సేవు యిప్పుడేలా
Language

(॥పల్లవి॥)
ఇందరిలో బిగి సేవు యిప్పుడేలా
నిందలమాట లన్నియు నీపై నున్నవిరా

(॥॥)
పంతగాఁడ వవుదువు పలుకరా
యింతచాలదా కోప మిఁక నేలరా
దొంతినున్నది వలవు తొలఁగకురా
అంతచలము రతులయందునే చూపరా

(॥॥)
చెల్లె నీకు రాజసము శిరసెత్తరా
తొల్లి నీకు మొక్కితి దూరలేలరా
వెల్లవిరాయఁ బనులు వెంటనే రారా! నీ-
పల్లద మేమిగల్లాను పానుపుపైఁ జూపరా

(॥॥)
కడుజాణ వౌదువు కాఁగిలించరా
వడఁబడ నిఁకనేల వద్దువద్దురా
కడఁగి శ్రీవేంకటేశ కలసితిరా! నీ-
అడియాల మింతయు నాయంగముపై నించరా

(||pallavi||)
iṁdarilo bigi sevu yippuḍelā
niṁdalamāḍa lanniyu nībai nunnavirā

(||||)
paṁtagām̐ḍa vavuduvu palugarā
yiṁtasāladā koba mim̐ka nelarā
dŏṁtinunnadi valavu tŏlam̐gagurā
aṁtasalamu radulayaṁdune sūbarā

(||||)
sĕllĕ nīgu rājasamu śhirasĕttarā
tŏlli nīgu mŏkkidi dūralelarā
vĕllavirāyam̐ banulu vĕṁṭane rārā! nī-
pallada memigallānu pānububaim̐ jūbarā

(||||)
kaḍujāṇa vauduvu kām̐giliṁcharā
vaḍam̐baḍa nim̐kanela vadduvaddurā
kaḍam̐gi śhrīveṁkaḍeśha kalasidirā! nī-
aḍiyāla miṁtayu nāyaṁgamubai niṁcharā