Imdarigi nokkadave yeligavu

ఇందరికి నొక్కడవె యేలికవు
Language

(॥పల్లవి॥)
ఇందరికి నొక్కడవె యేలికవు
ముందరి చేఁతలు నిన్ను మోచి రాదా(వా?) యిఁకను

(॥ఇంద॥)
ఆపెతోడ మాటలు నీవాడఁగానే పొద్దువోయ
పైపై యీపె లోనఁ బవ్వళించెను
వైవు గాఁగా వూడిగాలవారివొద్ద నున్న వారు
యేపను లెట్టవునో యెరఁగవా యిఁకను

(॥ఇంద॥)
గక్కువ నీపెను లేపఁగానే తెల్లవారె
మిక్కుటాన నాపలిగి మేడ యెక్కెను
నిక్కియిద్దరిచెలులు నీ వెంటఁ దిరిగేరు
యెక్కసుద్దు లెట్టవునో యెంచుకో నీ విఁకను

(॥ఇంద॥)
వేడుక నాపెఁ గూడఁగా వేగు చూడ వచ్చె నీపై
వోడక యిద్దరిఁ గూడి తొక్కచోటనె
యీడనే శ్రీవేంకటేశ యియ్యకొంటి మిందరము
ఆడుకోలు పంతాలు అనువాయ నిఁకను

(||pallavi||)
iṁdarigi nŏkkaḍavĕ yeligavu
muṁdari sem̐talu ninnu mosi rādā(vā?) yim̐kanu

(||iṁda||)
ābĕdoḍa māḍalu nīvāḍam̐gāne pŏdduvoya
paibai yībĕ lonam̐ bavvaḽiṁchĕnu
vaivu gām̐gā vūḍigālavārivŏdda nunna vāru
yebanu lĕṭṭavuno yĕram̐gavā yim̐kanu

(||iṁda||)
gakkuva nībĕnu lebam̐gāne tĕllavārĕ
mikkuḍāna nābaligi meḍa yĕkkĕnu
nikkiyiddarisĕlulu nī vĕṁṭam̐ dirigeru
yĕkkasuddu lĕṭṭavuno yĕṁchugo nī vim̐kanu

(||iṁda||)
veḍuga nābĕm̐ gūḍam̐gā vegu sūḍa vachchĕ nībai
voḍaga yiddarim̐ gūḍi tŏkkasoḍanĕ
yīḍane śhrīveṁkaḍeśha yiyyagŏṁṭi miṁdaramu
āḍugolu paṁtālu anuvāya nim̐kanu