ఇందరికి నొకచాలే యీ సుద్దులు
(॥పల్లవి॥)
ఇందరికి నొకచాలే యీ సుద్దులు
సందడి వలపు మొగచాటు దోఁచీ నీకు
(॥ఇంద॥)
చలము సాదించేవారు సారెకు నవ్వుదురా
అలిగినవారు నీ యండ నుందురా
యెలమి గొడవలెల్ల యేల కక్కెవు మామీఁద
పిలువరా చెప్పించే నీ ప్రియురాండ్ల చేతనే
(॥ఇంద॥)
తప్పులు వట్టేవారు తగిలి వీడెపిత్తురా
వుప్పటించేవారు నీతో నొద్దికవునురా
నెప్పున నీవేల మాపై నెపములు వేసేవు
చెప్పించే పిలువరా నీ చెలువలచేతనే
(॥ఇంద॥)
సొలసేటివారు నిన్ను చెక్కులఁ బెట్టుదురా
కలసితి నిదె శ్రీ వేంకటేశ్వరుఁడ
అలమేలుమంగ నేను అంత యేల కొసరేవు
తెలిపేఁ బిలువరా నీ తెఱవల చేతనే
(||pallavi||)
iṁdarigi nŏgasāle yī suddulu
saṁdaḍi valabu mŏgasāḍu dom̐sī nīgu
(||iṁda||)
salamu sādiṁchevāru sārĕgu navvudurā
aliginavāru nī yaṁḍa nuṁdurā
yĕlami gŏḍavalĕlla yela kakkĕvu māmīm̐da
piluvarā sĕppiṁche nī priyurāṁḍla sedane
(||iṁda||)
tappulu vaṭṭevāru tagili vīḍĕbitturā
vuppaḍiṁchevāru nīdo nŏddigavunurā
nĕppuna nīvela mābai nĕbamulu vesevu
sĕppiṁche piluvarā nī sĕluvalasedane
(||iṁda||)
sŏlaseḍivāru ninnu sĕkkulam̐ bĕṭṭudurā
kalasidi nidĕ śhrī veṁkaḍeśhvarum̐ḍa
alamelumaṁga nenu aṁta yela kŏsarevu
tĕlibem̐ biluvarā nī tĕṟavala sedane