ఇందరికి నీవే గుఱి యిదివో దిష్టాంతము
(॥పల్లవి॥)
ఇందరికి నీవే గుఱి యిదివో దిష్టాంతము
కందువతోఁ జేయవయ్య కాఁపురములూ
(॥ఇందరి॥)
చేతికి లోనైనయట్టి చెలువుఁడు గలిగితే
యేతులకు రమణు లేమేమి సేయరు
గాతల నీ శిర సెక్కెఁ గామిని యొకతె దొల్లి
యీతలఁ దమవారు యేమి సేతురో
(॥ఇందరి॥)
మగవాఁడు వలచితే మగువలయినవారు
యెగసక్కేలకును యేమేమి సేయరు
వెగటుగ నొక లేమ వీఁపున మోఁపించె నిన్ను
యెగువదిగువసతు లేమి సేతురో
(॥ఇందరి॥)
శ్రీవేంకటేశ నీవు చిత్తగించి కూడితేను
యేవనితలై నా నేమేమి సేయరు
శ్రీవనిత వురముపైఁ జేకొని నిలిచె నీకు
యీవల మాబోంటెల్లా నేమి సేతురో
(||pallavi||)
iṁdarigi nīve guṟi yidivo diṣhṭāṁtamu
kaṁduvadom̐ jeyavayya kām̐puramulū
(||iṁdari||)
sedigi lonainayaṭṭi sĕluvum̐ḍu galigide
yedulagu ramaṇu lememi seyaru
gādala nī śhira sĕkkĕm̐ gāmini yŏgadĕ dŏlli
yīdalam̐ damavāru yemi seduro
(||iṁdari||)
magavām̐ḍu valaside maguvalayinavāru
yĕgasakkelagunu yememi seyaru
vĕgaḍuga nŏga lema vīm̐puna mom̐piṁchĕ ninnu
yĕguvadiguvasadu lemi seduro
(||iṁdari||)
śhrīveṁkaḍeśha nīvu sittagiṁchi kūḍidenu
yevanidalai nā nememi seyaru
śhrīvanida vuramubaim̐ jegŏni nilisĕ nīgu
yīvala māboṁṭĕllā nemi seduro