Imdarigi dishtamu yeebanulu

ఇందరికి దిష్టము యీపనులు
Language

(॥పల్లవి॥)
ఇందరికి దిష్టము యీపనులు
సందడించీ లోలోన సకలమర్మములు

(॥ఇంద॥)
మనసే మర్మము మచ్చికలకెల్లాను
తనుసోఁకులే మర్మము తనివికిని
చెనకులే మర్మము చెలరేఁగివున్నందుకు
కనుఁగొనరే యిద్దరికతలూ గానవచ్చె

(॥ఇంద॥)
నగవులే మర్మము ననుపులకెల్లాను
మొగమాటమే మర్మము ముదములకు
బిగువులే మర్మము పెడరేఁచేపనులకు
తగవు చెప్ప రే వీరి తమకము నిండెను

(॥ఇంద॥)
కోరికలే మర్మము కూటములకెల్లాను
మేరమీరుటే మర్మము మేకులకును
యీరీతి శ్రీవేంకేటేశుఁడింతలోనె నన్ను నేలె
తేరుచరే తమమేలు తేటతెల్లమిగను

(||pallavi||)
iṁdarigi diṣhṭamu yībanulu
saṁdaḍiṁchī lolona sagalamarmamulu

(||iṁda||)
manase marmamu machchigalagĕllānu
tanusom̐kule marmamu tanivigini
sĕnagule marmamu sĕlarem̐givunnaṁdugu
kanum̐gŏnare yiddarigadalū gānavachchĕ

(||iṁda||)
nagavule marmamu nanubulagĕllānu
mŏgamāḍame marmamu mudamulagu
biguvule marmamu pĕḍarem̐sebanulagu
tagavu sĕppa re vīri tamagamu niṁḍĕnu

(||iṁda||)
korigale marmamu kūḍamulagĕllānu
meramīruḍe marmamu megulagunu
yīrīdi śhrīveṁkeḍeśhum̐ḍiṁtalonĕ nannu nelĕ
terusare tamamelu teḍadĕllamiganu