ఇందరికంటె నెక్కుడు యెంచఁగ యోగీశ్వరుఁడు
(॥పల్లవి॥)
ఇందరికంటె నెక్కుడు యెంచఁగ యోగీశ్వరుఁడు
అంది కనుఁగొను తన యంతరాత్మ నెపుడు
(॥ఇందరి॥)
చూడఁగల వన్నియును చూడని యోగీశ్వరుఁడు
బూడిదెలో గచ్చకాయై పొరయఁ డెందు
యేడనైనా నుండనీ యిచ్చైన యోగీశ్వరుఁడు
వాడలో కుమ్మరిపురువువలె నెందు నంటఁడు
(॥ఇందరి॥)
చేనంటి యే పుణ్యమైనాఁ జేయని యోగీశ్వరుఁడు
నూనె గొల్చిన కుంచమై నుశికేలును
వీనుల నేమైనాను వినని యోగీశ్వరుఁడు
నానేటి తామరపాకై నడుమఁ దా నుండును
(॥ఇందరి॥)
వొడ్డి చవులుగొనని ఉత్తమయోగీశ్వరుఁడు
జిడ్డంటని నాలికై నిశ్చింతాన నుండు
యెడ్డవలె మెలఁగని యెదలో యోగీశ్వరుఁడు
దొడ్డ శ్రీవేంకటేశ్వరుతోనే రమించును
(||pallavi||)
iṁdarigaṁṭĕ nĕkkuḍu yĕṁcham̐ga yogīśhvarum̐ḍu
aṁdi kanum̐gŏnu tana yaṁtarātma nĕbuḍu
(||iṁdari||)
sūḍam̐gala vanniyunu sūḍani yogīśhvarum̐ḍu
būḍidĕlo gachchagāyai pŏrayam̐ ḍĕṁdu
yeḍanainā nuṁḍanī yichchaina yogīśhvarum̐ḍu
vāḍalo kummariburuvuvalĕ nĕṁdu naṁṭam̐ḍu
(||iṁdari||)
senaṁṭi ye puṇyamainām̐ jeyani yogīśhvarum̐ḍu
nūnĕ gŏlsina kuṁchamai nuśhigelunu
vīnula nemainānu vinani yogīśhvarum̐ḍu
nāneḍi tāmarabāgai naḍumam̐ dā nuṁḍunu
(||iṁdari||)
vŏḍḍi savulugŏnani uttamayogīśhvarum̐ḍu
jiḍḍaṁṭani nāligai niśhchiṁtāna nuṁḍu
yĕḍḍavalĕ mĕlam̐gani yĕdalo yogīśhvarum̐ḍu
dŏḍḍa śhrīveṁkaḍeśhvarudone ramiṁchunu