ఇందరితో వట్టియెమ్మె లేమిచెప్పేవు
(॥పల్లవి॥)
ఇందరితో వట్టియెమ్మె లేమిచెప్పేవు
మందలించి వద్దనేమా మారుకొని మిమ్మును
(॥ఇంద॥)
తచ్చనకాఁ డాతఁడు దాయక పాయక వుండె
ఇచ్చకురాలవు నీవు ఇద్దరు సరే
అచ్చలాన మీలో మీకు నచ్చివచ్చు వలపులు
విచ్చనవిడిఁ బెండ్లాడి వెలయరే యిపుడు
(॥ఇంద॥)
మరగించనేర్చును మర్మము లంటి యతఁడు
కరగించనేర్తువు కాఁగిట నీవు
పొరుగే మీకిద్దరికి పొందు లిట్టె జరగును
పరగ నొక్క మనసై బతుకరే యిపుడు
(॥ఇంద॥)
నవ్వనోపు నాతఁడు నయమున నీతోను
రవ్వసేయ నోపుదువు రతుల నీవు
యివ్వల శ్రీవేంకటేశుఁ డిట్టే నిన్నూ నన్నూ నేలె
వువ్విళ్లూర సంతసాన నుండరే యిపుడు
(||pallavi||)
iṁdarido vaṭṭiyĕmmĕ lemisĕppevu
maṁdaliṁchi vaddanemā mārugŏni mimmunu
(||iṁda||)
tachchanagām̐ ḍādam̐ḍu dāyaga pāyaga vuṁḍĕ
ichchagurālavu nīvu iddaru sare
achchalāna mīlo mīgu nachchivachchu valabulu
vichchanaviḍim̐ bĕṁḍlāḍi vĕlayare yibuḍu
(||iṁda||)
maragiṁchanersunu marmamu laṁṭi yadam̐ḍu
karagiṁchanerduvu kām̐giḍa nīvu
pŏruge mīgiddarigi pŏṁdu liṭṭĕ jaragunu
paraga nŏkka manasai badugare yibuḍu
(||iṁda||)
navvanobu nādam̐ḍu nayamuna nīdonu
ravvaseya nobuduvu radula nīvu
yivvala śhrīveṁkaḍeśhum̐ ḍiṭṭe ninnū nannū nelĕ
vuvviḽlūra saṁtasāna nuṁḍare yibuḍu