ఇందరి వినోదాననే యిట్లున్నాఁడు
(॥పల్లవి॥)
ఇందరి వినోదాననే యిట్లున్నాఁడు
చెంది సొమ్ములెల్లాఁ బెట్టి సింగారించరే
(॥ఇంద॥)
మేడలోన నున్నవాఁడు మిక్కిలితమకమున
పాడించుకొంటా నున్నాఁడు భామలచేత
వూడిగపుసతులాల వొద్ద నుండఁగదరే
వీడెమీరే అడపము వెలఁదులాల
(॥ఇంద॥)
పరగ గద్దెపై నుండి పాత్రకత్తెలచేత
గరిమ నాడించుకొంటా కడుఁజొక్కీని
సిరులఁ గట్టికవారు సేయరే బరాబరి
వరుస నాలపట్టాలవారెల్లా విసరరే
(॥ఇంద॥)
శ్రీవేంకటాద్రి నున్నాఁడు జిగి నలమేల్ మంగను
యీవేళఁ గూడియున్నాఁడు యీ దేవుఁడు
వేవేగం దెరవేయరే వెసం జనవరులాల
బూవపుసవతులాల పొగడరే మీరు
(||pallavi||)
iṁdari vinodānane yiṭlunnām̐ḍu
sĕṁdi sŏmmulĕllām̐ bĕṭṭi siṁgāriṁchare
(||iṁda||)
meḍalona nunnavām̐ḍu mikkilidamagamuna
pāḍiṁchugŏṁṭā nunnām̐ḍu bhāmalaseda
vūḍigabusadulāla vŏdda nuṁḍam̐gadare
vīḍĕmīre aḍabamu vĕlam̐dulāla
(||iṁda||)
paraga gaddĕbai nuṁḍi pātragattĕlaseda
garima nāḍiṁchugŏṁṭā kaḍum̐jŏkkīni
sirulam̐ gaṭṭigavāru seyare barābari
varusa nālabaṭṭālavārĕllā visarare
(||iṁda||)
śhrīveṁkaḍādri nunnām̐ḍu jigi nalamel maṁganu
yīveḽam̐ gūḍiyunnām̐ḍu yī devum̐ḍu
vevegaṁ dĕraveyare vĕsaṁ janavarulāla
būvabusavadulāla pŏgaḍare mīru