ఇందరి నేలేటివాఁడు యేమి సేసునే
(॥పల్లవి॥)
ఇందరి నేలేటివాఁడు యేమి సేసునే
పొందులు మరిగితివి పొసఁగవే నీవు
(॥ఇందరి॥)
సన్నలిట్టే యాతఁడు నీ సవతితోఁ జేసె నంటా
యెన్ని మాటలాడేవే యిప్పుడు నీవు
విన్నపము చెవులొగ్గి వినెనంటా నప్పటిని
యెన్నికగా రొమ్ముదట్టే విదియేలే నీవు
(॥ఇందరి॥)
గక్కన నాపె నితడు కప్పురాన వేసె నంటా
మొక్కలాన బొమ్మలేల ముడివెట్టేవే
పక్కన గానుక నిమ్మపండు చేతనందె నంటా
పెక్కువగా నేలవొట్టు వెట్టేవే నీవు
(॥ఇందరి॥)
శ్రీవేంకటేశుఁ డాపెపై జేతులు చాఁచె నంటా
రావాడి యెంత కాఁగిట రాయిడించేవే
మోవ నీపాదాలకాకె మొక్కఁగఁ జేసె నంటా
పోవులుగా నింతయేల పొగడేవు నీవు.
(||pallavi||)
iṁdari neleḍivām̐ḍu yemi sesune
pŏṁdulu marigidivi pŏsam̐gave nīvu
(||iṁdari||)
sannaliṭṭe yādam̐ḍu nī savadidom̐ jesĕ naṁṭā
yĕnni māḍalāḍeve yippuḍu nīvu
vinnabamu sĕvulŏggi vinĕnaṁṭā nappaḍini
yĕnnigagā rŏmmudaṭṭe vidiyele nīvu
(||iṁdari||)
gakkana nābĕ nidaḍu kappurāna vesĕ naṁṭā
mŏkkalāna bŏmmalela muḍivĕṭṭeve
pakkana gānuga nimmabaṁḍu sedanaṁdĕ naṁṭā
pĕkkuvagā nelavŏṭṭu vĕṭṭeve nīvu
(||iṁdari||)
śhrīveṁkaḍeśhum̐ ḍābĕbai jedulu sām̐sĕ naṁṭā
rāvāḍi yĕṁta kām̐giḍa rāyiḍiṁcheve
mova nībādālagāgĕ mŏkkam̐gam̐ jesĕ naṁṭā
povulugā niṁtayela pŏgaḍevu nīvu.