ఇందరి ముందర నిట్టె యేరా నీవు
(॥పల్లవి॥)
ఇందరి ముందర నిట్టె యేరా నీవు
విందువలె నీకు నీవే వేసాలు సేసేవు
(॥ఇంద॥)
చెంత నీకెమ్మోవిమీఁద సిగ్గుదేర నవ్వేవు
యింతలో నామోము చూచి యేరా నీవు
వింతలుగ నిను నేమి వెంగ మాడలేదు నేము
పంతపునీగుట్టు నీవే బాయిట వేసేవు
(॥ఇంద॥)
అడుగనిమాట లెల్లా నప్పటి నాడ వచ్చేవు
యెడసిన చంచలాన నేరా నీవు
తడవము తాఁకము తమకించి యలుగము
వెడ నీసుద్దులు వెల్లవిరి గావించేవు
(॥ఇంద॥)
నెక్కొని వూరకే నీవు నిజములు నెరుపేవు
యెక్కువ నాకాఁగిటిలో నేరా నీవు
గక్కన శ్రీ వేంకటేశ కలసితి విటు నన్ను
వుక్కుమీరి నన్ను నేల వొడఁబరచేవు
(||pallavi||)
iṁdari muṁdara niṭṭĕ yerā nīvu
viṁduvalĕ nīgu nīve vesālu sesevu
(||iṁda||)
sĕṁta nīgĕmmovimīm̐da siggudera navvevu
yiṁtalo nāmomu sūsi yerā nīvu
viṁtaluga ninu nemi vĕṁga māḍaledu nemu
paṁtabunīguṭṭu nīve bāyiḍa vesevu
(||iṁda||)
aḍuganimāḍa lĕllā nappaḍi nāḍa vachchevu
yĕḍasina saṁchalāna nerā nīvu
taḍavamu tām̐kamu tamagiṁchi yalugamu
vĕḍa nīsuddulu vĕllaviri gāviṁchevu
(||iṁda||)
nĕkkŏni vūrage nīvu nijamulu nĕrubevu
yĕkkuva nāgām̐giḍilo nerā nīvu
gakkana śhrī veṁkaḍeśha kalasidi viḍu nannu
vukkumīri nannu nela vŏḍam̐barasevu