Imdari mechchimcharaadaa yidevo maadaa

ఇందరి మెచ్చించరాదా యిదెవో మాటా
Language

(॥పల్లవి॥)
ఇందరి మెచ్చించరాదా యిదెవో మాటా
అందుకే కోపించితి నదివో మాటా

(॥ఇందరి॥)
గొప్ప గొప్ప కన్ను లానె కొమ్మ నీతో మాటలాడె
యిప్పుడు లేదని బొంకే విదివో మాటా
ముప్పిరి నీ వల పెల్లా మోవిమీఁదనుండఁగాను
అప్పటి మానవు నాతో నదివో వటా

(॥ఇందరి॥)
యింతిపాదము లత్తుక యిదెవో నీమేన నంటె
నింతలోనే మొఱఁగేవు యిదివో మాటా
వింతగాఁ గస్తూరిబొట్టు వెసఁ జెక్కుమీఁద నదే
అంత చెల్ల దింక నీకు నదెవో మాటా

(॥ఇందరి॥)
శ్రీవేంకటేశ నీవు సేసిన దెల్లాఁ జేసి
యీవల పంత మిచ్చే విదివో మాటా
భావపు నీ రతులలో పరవశమై నే
నావ లెల్లా మఱచితి నదివో మాటా

(||pallavi||)
iṁdari mĕchchiṁcharādā yidĕvo māḍā
aṁduge kobiṁchidi nadivo māḍā

(||iṁdari||)
gŏppa gŏppa kannu lānĕ kŏmma nīdo māḍalāḍĕ
yippuḍu ledani bŏṁke vidivo māḍā
muppiri nī vala pĕllā movimīm̐danuṁḍam̐gānu
appaḍi mānavu nādo nadivo vaḍā

(||iṁdari||)
yiṁtibādamu lattuga yidĕvo nīmena naṁṭĕ
niṁtalone mŏṟam̐gevu yidivo māḍā
viṁtagām̐ gastūribŏṭṭu vĕsam̐ jĕkkumīm̐da nade
aṁta sĕlla diṁka nīgu nadĕvo māḍā

(||iṁdari||)
śhrīveṁkaḍeśha nīvu sesina dĕllām̐ jesi
yīvala paṁta michche vidivo māḍā
bhāvabu nī radulalo paravaśhamai ne
nāva lĕllā maṟasidi nadivo māḍā