ఇందరి బ్రదుకులును యీశ్వరుని చేతి దే
(॥పల్లవి॥)
ఇందరి బ్రదుకులును యీశ్వరుని చేతి దే
యెందూ సుజ్ఞానులు నిన్నే యెఱిఁగి కొలిచిరి
(॥ఇంద॥)
నినుఁ గనుఁగొనలేక నీచేఁత దెలియక
మనుజులదృష్టమని మది నెంతురు
అనిశము నీసృష్టి యిట్లని నిశ్చయించరాక
తనరఁ గొందరు తమతమ కర్మ మందురు
(॥ఇంద॥)
మహి నీలీల లెంచక మహిమలు దెలియక
బహుగతి జగత్తు స్వభావ మందురు
నిహితమై నీ వింతటా నిండుకుండుట చూడక
తహతహఁ గొందరు యింతా మిథ్య యందురు
(॥ఇంద॥)
భావములోన నిన్ను భావించ వసముగాక
ఆవల నిరాకారమని యందురు
శ్రీవేంకటేశ నీవు చేరి యెదుట నుండఁగా
దేవుఁడు మనవాఁడుగా తెలిసితి మందురు
(||pallavi||)
iṁdari bradugulunu yīśhvaruni sedi de
yĕṁdū sujñānulu ninne yĕṟim̐gi kŏlisiri
(||iṁda||)
ninum̐ ganum̐gŏnalega nīsem̐ta dĕliyaga
manujuladṛṣhṭamani madi nĕṁturu
aniśhamu nīsṛṣhṭi yiṭlani niśhchayiṁcharāga
tanaram̐ gŏṁdaru tamadama karma maṁduru
(||iṁda||)
mahi nīlīla lĕṁchaga mahimalu dĕliyaga
bahugadi jagattu svabhāva maṁduru
nihidamai nī viṁtaḍā niṁḍuguṁḍuḍa sūḍaga
tahadaham̐ gŏṁdaru yiṁtā mithya yaṁduru
(||iṁda||)
bhāvamulona ninnu bhāviṁcha vasamugāga
āvala nirāgāramani yaṁduru
śhrīveṁkaḍeśha nīvu seri yĕduḍa nuṁḍam̐gā
devum̐ḍu manavām̐ḍugā tĕlisidi maṁduru