ఇందరి భావము నీవే యెరుఁగు దాకె యెరుఁగు
(॥పల్లవి॥)
ఇందరి భావము నీవే యెరుఁగు దాకె యెరుఁగు
యిందుకుఁగా నింతసేయ నేమిటికయ్యా
(॥ఇంద॥)
సుదతి నిన్నుఁ గోపానఁ జూడకొక్క మాను చూచె
అదె యొక్క మానితో మాటాడె సొలసి
పదరి పరవాశానఁ బట్టెనొక్క మానికొమ్ము
వొదిగి యొకమానిపై నుస్సురనెను
(॥ఇంద॥)
మానిని యొకమానిపై మదనరాగము చిమ్మె
ఆనిన పూఁదేనె యొక్క మానఁ జిలికె
పూనిన నీబాసలకు నొకమానిపై నవ్వె
తానుడుకు దీర నొకమానిపొంతఁ బాడెను
(॥ఇంద॥)
అంత నీవు దగ్గరితే అందు మాను చేతనంటె
కాంత నీమారొకమాను కాలఁదన్నెను
ఇంతలో శ్రీవేంకటేశ యింతి నీవు గూడఁగను
వింతగా నీతరువుల విరులు నీకిచ్చెను
(||pallavi||)
iṁdari bhāvamu nīve yĕrum̐gu dāgĕ yĕrum̐gu
yiṁdugum̐gā niṁtaseya nemiḍigayyā
(||iṁda||)
sudadi ninnum̐ gobānam̐ jūḍagŏkka mānu sūsĕ
adĕ yŏkka mānido māḍāḍĕ sŏlasi
padari paravāśhānam̐ baṭṭĕnŏkka mānigŏmmu
vŏdigi yŏgamānibai nussuranĕnu
(||iṁda||)
mānini yŏgamānibai madanarāgamu simmĕ
ānina pūm̐denĕ yŏkka mānam̐ jiligĕ
pūnina nībāsalagu nŏgamānibai navvĕ
tānuḍugu dīra nŏgamānibŏṁtam̐ bāḍĕnu
(||iṁda||)
aṁta nīvu daggaride aṁdu mānu sedanaṁṭĕ
kāṁta nīmārŏgamānu kālam̐dannĕnu
iṁtalo śhrīveṁkaḍeśha yiṁti nīvu gūḍam̐ganu
viṁtagā nīdaruvula virulu nīgichchĕnu