ఇందరముఁ గంటిమి నీ విదిగానవా
(॥పల్లవి॥)
ఇందరముఁ గంటిమి నీ విదిగానవా
వొందిలి పానుపుమీఁద నున్నది గానవా
(॥॥)
బంగారుపావాలు మెట్టి పడఁతి యెవ్వతోకాని
ముంగిటఁ బొలసె నీ విమ్ములఁ గానవా
పొంగేటిజవ్వనముతో పొదరిల్లు దూరి నీతో
సంగవించి సన్నసేసె నదిగానవా
(॥॥)
వల్లెవాటుఁ బయ్యదతో వనితలపై నొరగి
యిల్లిలదె యేకతమాడీ నిది గానవా
కొల్లలుగా నాడనాడ కొప్పుపూవు లటు జార
చెల్లఁబో కులుకినవ్వేచేతఁ గానవా
(॥॥)
జవ్వాదివాసనలతో సతి నీవెనక నదె
యెవ్వరంటా నున్నవాఁడ విది గానవా
రవ్వగా శ్రీ వేంకటేశ రమణిఁ గూడితి విదె
యివ్వలనే బొంకేవు యిప్పుడైనాఁ గానవా
(||pallavi||)
iṁdaramum̐ gaṁṭimi nī vidigānavā
vŏṁdili pānubumīm̐da nunnadi gānavā
(||||)
baṁgārubāvālu mĕṭṭi paḍam̐ti yĕvvadogāni
muṁgiḍam̐ bŏlasĕ nī vimmulam̐ gānavā
pŏṁgeḍijavvanamudo pŏdarillu dūri nīdo
saṁgaviṁchi sannasesĕ nadigānavā
(||||)
vallĕvāḍum̐ bayyadado vanidalabai nŏragi
yilliladĕ yegadamāḍī nidi gānavā
kŏllalugā nāḍanāḍa kŏppubūvu laḍu jāra
sĕllam̐bo kuluginavvesedam̐ gānavā
(||||)
javvādivāsanalado sadi nīvĕnaga nadĕ
yĕvvaraṁṭā nunnavām̐ḍa vidi gānavā
ravvagā śhrī veṁkaḍeśha ramaṇim̐ gūḍidi vidĕ
yivvalane bŏṁkevu yippuḍainām̐ gānavā