ఇందరము నెరిగితి మిఁక నేలా
(॥పల్లవి॥)
ఇందరము నెరిగితి మిఁక నేలా
సందడి సవతులలో సరి నుండుఁ గాకా
(॥ఇంద॥)
నిక్కి నిక్కి చూచి యాపె నీతో నేల సన్న సేసీ
రక్కసితనము మాని రమ్మన రాదా
దక్కి వున్నాఁడవు నీవు తనపాలిటికిఁ దొల్లె
వెక్కస మై నే నుండితే వెర పేల తనకు
(॥ఇంద॥)
అంత నింత నుండి నీతో ఆపె యాల నవ్వీని
వంతుకు నీతోఁ బెనఁగ వచ్చుఁ గాక
వింతవాఁడవా నీవు వేరు నే మింతే కాక
యింతేసి పనులు సేసె యిఁక నేల వెఱపూ
(॥ఇంద॥)
పొరుగుపొంతల నాపె పూఁచి ని న్నేల కూడీని
సిరులు నీసొమ్ము గాఁగఁ జేసుకో రాదా
యిరవై నన్నుఁ గూడితి విదె శ్రీవెంకటేశుఁడ
తెరవాసె వెర పేల తెల్ల మాయఁ బనులు
(||pallavi||)
iṁdaramu nĕrigidi mim̐ka nelā
saṁdaḍi savadulalo sari nuṁḍum̐ gāgā
(||iṁda||)
nikki nikki sūsi yābĕ nīdo nela sanna sesī
rakkasidanamu māni rammana rādā
dakki vunnām̐ḍavu nīvu tanabāliḍigim̐ dŏllĕ
vĕkkasa mai ne nuṁḍide vĕra pela tanagu
(||iṁda||)
aṁta niṁta nuṁḍi nīdo ābĕ yāla navvīni
vaṁtugu nīdom̐ bĕnam̐ga vachchum̐ gāga
viṁtavām̐ḍavā nīvu veru ne miṁte kāga
yiṁtesi panulu sesĕ yim̐ka nela vĕṟabū
(||iṁda||)
pŏrugubŏṁtala nābĕ pūm̐si ni nnela kūḍīni
sirulu nīsŏmmu gām̐gam̐ jesugo rādā
yiravai nannum̐ gūḍidi vidĕ śhrīvĕṁkaḍeśhum̐ḍa
tĕravāsĕ vĕra pela tĕlla māyam̐ banulu