ఇందర మున్నారము యెవ్వతె యేచూపు చూచె
(॥పల్లవి॥)
ఇందర మున్నారము యెవ్వతె యేచూపు చూచె
అందముగా నీవే నా కానతియ్యవయ్యా
(॥ఇందర॥)
సిగ్గు వడ్డ చూపులు చిఱుతలై మీఁద బారు
దిగ్గన లోనైనచూపు తీగెసాగును
యేగ్గువట్టినచూపులు యీడా నాడా మలసును
దగ్గరి పైకొన్నచూపు తగులై నిలుచును
(॥ఇందర॥)
ఆసపడ్డ చూపులు అంచలంచలై వచ్చు
వేసారుకొన్నచూపు వేళమే మళ్ళు
రోసపుచూపులు మించురూఢిఁ గడకండ్లను
వాసులచూపులు తమవద్దనే వుండును
(॥ఇందర॥)
వొలసీ నొల్లనిచూపు వోరలై కడఁబారు
వలసినచూపు పరవశ మందించు
యెలమి శ్రీవేంకటేశ యిటు నన్నుఁ గూడితివి
తెలుసు నన్నియు నీకే దిమ్మరివి గనక
(||pallavi||)
iṁdara munnāramu yĕvvadĕ yesūbu sūsĕ
aṁdamugā nīve nā kānadiyyavayyā
(||iṁdara||)
siggu vaḍḍa sūbulu siṟudalai mīm̐da bāru
diggana lonainasūbu tīgĕsāgunu
yegguvaṭṭinasūbulu yīḍā nāḍā malasunu
daggari paigŏnnasūbu tagulai nilusunu
(||iṁdara||)
āsabaḍḍa sūbulu aṁchalaṁchalai vachchu
vesārugŏnnasūbu veḽame maḽḽu
rosabusūbulu miṁchurūḍhim̐ gaḍagaṁḍlanu
vāsulasūbulu tamavaddane vuṁḍunu
(||iṁdara||)
vŏlasī nŏllanisūbu voralai kaḍam̐bāru
valasinasūbu paravaśha maṁdiṁchu
yĕlami śhrīveṁkaḍeśha yiḍu nannum̐ gūḍidivi
tĕlusu nanniyu nīge dimmarivi ganaga