(॥పల్లవి॥)
ఇందర మున్నార మిక్కడనూ మీ-
కందెడి నేకత మదివో లోనా
(॥ఇంద॥)
మలయుచు రమణుఁడు మాఁటలాడితే
చెలియరొ నీకేలే సిగ్గులు
మెలఁగుమర్మములు మీలో నేఁటివొ
తెలియదు మోహమె తెలిసీఁ గాని
(॥ఇంద॥)
నెఱవుగ నాతఁడు నీమోము చూచితే
తఱి నేలే యిఁకఁ దలవంపులు
తఱఁగులు మొఱఁగులు తతి మీకేఁటివొ
యెఱఁగము పొందొక టెఱుఁగుదుము
(॥ఇంద॥)
రమ్మని యాతఁడు రతికిఁ బిలిచితే
సమ్మతి నింకేలే జంకెనలు
యిమ్ముల శ్రీవేంకటేశుఁడే కూడెను
నమ్మ మితవు లిఁక నమ్మేము వేఁడు
(||pallavi||)
iṁdara munnāra mikkaḍanū mī-
kaṁdĕḍi negada madivo lonā
(||iṁda||)
malayusu ramaṇum̐ḍu mām̐ṭalāḍide
sĕliyarŏ nīgele siggulu
mĕlam̐gumarmamulu mīlo nem̐ṭivŏ
tĕliyadu mohamĕ tĕlisīm̐ gāni
(||iṁda||)
nĕṟavuga nādam̐ḍu nīmomu sūside
taṟi nele yim̐kam̐ dalavaṁpulu
taṟam̐gulu mŏṟam̐gulu tadi mīgem̐ṭivŏ
yĕṟam̐gamu pŏṁdŏga ṭĕṟum̐gudumu
(||iṁda||)
rammani yādam̐ḍu radigim̐ biliside
sammadi niṁkele jaṁkĕnalu
yimmula śhrīveṁkaḍeśhum̐ḍe kūḍĕnu
namma midavu lim̐ka nammemu vem̐ḍu