ఇందాఁకావలెఁ గాదు యిదేమి నీవు
(॥పల్లవి॥)
ఇందాఁకావలెఁ గాదు యిదేమి నీవు
సందుగొని సారెసారె సరసమాడేవు
(॥ఇందా॥)
నీమాట సరివచ్చెనో నీ వేమి దలఁచితివో
నామోము చూచి యిట్టె నవ్వు నవ్వేవు
కాముఁడు మరి యేసెనో కాంతలమాట వింటివో
గోమునఁ బెంచినచన్నుఁగొండ లంటేవు
(॥ఇందా॥)
ఇచ్చకములు చూపేవో యెగసక్కెము చేసేవో
మచ్చికచేయుచు నాతో మాటలాడేవు
ముచ్చటాడెవో కీరాలు మోహము నీకుఁ బుట్టెనో
పచ్చితేనెమోవికి పైకొనేవు
(॥ఇందా॥)
వన్నెలు చూపవలసో వాడికలు సేసేవో
కన్నులఁ దప్పకచూచి కాఁగిలించేవు
వెన్నెలచంద్రుఁ డేఁచెనో వేడుకో శ్రీవేంకటేశ
మన్ననరతుల కె మచ్చు చల్లేవు
(||pallavi||)
iṁdām̐kāvalĕm̐ gādu yidemi nīvu
saṁdugŏni sārĕsārĕ sarasamāḍevu
(||iṁdā||)
nīmāḍa sarivachchĕno nī vemi dalam̐sidivo
nāmomu sūsi yiṭṭĕ navvu navvevu
kāmum̐ḍu mari yesĕno kāṁtalamāḍa viṁṭivo
gomunam̐ bĕṁchinasannum̐gŏṁḍa laṁṭevu
(||iṁdā||)
ichchagamulu sūbevo yĕgasakkĕmu sesevo
machchigaseyusu nādo māḍalāḍevu
muchchaḍāḍĕvo kīrālu mohamu nīgum̐ buṭṭĕno
pachchidenĕmovigi paigŏnevu
(||iṁdā||)
vannĕlu sūbavalaso vāḍigalu sesevo
kannulam̐ dappagasūsi kām̐giliṁchevu
vĕnnĕlasaṁdrum̐ ḍem̐sĕno veḍugo śhrīveṁkaḍeśha
mannanaradula kĕ machchu sallevu