Imdaamkaam boralidivi yedaleni virahaana

ఇందాఁకాఁ బొరలితివి యేడలేని విరహాన
Language

(॥పల్లవి॥)
ఇందాఁకాఁ బొరలితివి యేడలేని విరహాన
కందువ నీపాలఁ జిక్కె కాంతుఁడు నేఁడిదివో

(॥ఇందా॥)
చెలువుఁడు వీడె వచ్చెఁ జిత్తగించవే నీవు
కలికికన్నులఁ జూచి కరఁగించవే
పలుకుఁదేనెలు మోవిఁ బైకోన మాటాడవే
పిలుచుకవచ్చితిమి ప్రియములుచెప్పవే

(॥ఇందా॥)
అతఁడు విడెమిచ్చీని అందుకొనివె ఇప్పుడు
చేతులెత్తి మనసారా సేసవెట్టవే
యీతల సరుసనుండి ఇట్టె సరసమాడవే
నీతో నోనగర్చితిమి నిండాఁ గాఁగిలించవే

(॥ఇందా॥)
శ్రీవేంకటేశుఁ డేలెఁ జిరునవ్వు నవ్వవే
మోవితీపు చూపి కేలు మొగిడించవే
యీవేళ నలమేల్‌మంగ వెనసితి వితనితో
సేవసేసీ నీరతులఁ జేకొని మెప్పించవే

(||pallavi||)
iṁdām̐kām̐ bŏralidivi yeḍaleni virahāna
kaṁduva nībālam̐ jikkĕ kāṁtum̐ḍu nem̐ḍidivo

(||iṁdā||)
sĕluvum̐ḍu vīḍĕ vachchĕm̐ jittagiṁchave nīvu
kaligigannulam̐ jūsi karam̐giṁchave
palugum̐denĕlu movim̐ baigona māḍāḍave
pilusugavachchidimi priyamulusĕppave

(||iṁdā||)
adam̐ḍu viḍĕmichchīni aṁdugŏnivĕ ippuḍu
sedulĕtti manasārā sesavĕṭṭave
yīdala sarusanuṁḍi iṭṭĕ sarasamāḍave
nīdo nonagarsidimi niṁḍām̐ gām̐giliṁchave

(||iṁdā||)
śhrīveṁkaḍeśhum̐ ḍelĕm̐ jirunavvu navvave
movidību sūbi kelu mŏgiḍiṁchave
yīveḽa nalamel‌maṁga vĕnasidi vidanido
sevasesī nīradulam̐ jegŏni mĕppiṁchave