Imdaamkaam bodagaana miduvamtivi

ఇందాఁకాఁ బొడగాన మిటువంటివి
Language

(॥పల్లవి॥)
ఇందాఁకాఁ బొడగాన మిటువంటివి
ఇందిరారమణి భావ మిప్పుడే సొంపెక్కెను

(॥ఇందాఁ॥)
మగువ నెమ్మోము తామరపువ్వు వికసించె
తగు విభుఁడనే సూర్యోదయవేళను
నిడిడి నెన్నడుమనే నెమలియుఁ జెలరేఁగె
మిగుల విభునికాంతి మేఘోదయమున

(॥ఇందాఁ॥)
సతి కనుఁగవలనే చకోరములు నిక్కె
అతనిసన్న వ్వువెన్నెలలామనివేళ
జతనాన పిరుఁదనే సైకతము నీరుపట్టె
రతి రమణుని కృపారసవేళను

(॥ఇందాఁ॥)
అంగనదేహవల్లి అంతయునుఁబులకించె
రంగగు శ్రీ వేంకటేశురతివేళను
ముంగిట చెలి చెమటముంగారు లవెముంచె
అంగజసాములచేత నలసినవేళను

(||pallavi||)
iṁdām̐kām̐ bŏḍagāna miḍuvaṁṭivi
iṁdirāramaṇi bhāva mippuḍe sŏṁpĕkkĕnu

(||iṁdām̐||)
maguva nĕmmomu tāmarabuvvu vigasiṁchĕ
tagu vibhum̐ḍane sūryodayaveḽanu
niḍiḍi nĕnnaḍumane nĕmaliyum̐ jĕlarem̐gĕ
migula vibhunigāṁti meghodayamuna

(||iṁdām̐||)
sadi kanum̐gavalane sagoramulu nikkĕ
adanisanna vvuvĕnnĕlalāmaniveḽa
jadanāna pirum̐dane saigadamu nīrubaṭṭĕ
radi ramaṇuni kṛpārasaveḽanu

(||iṁdām̐||)
aṁganadehavalli aṁtayunum̐bulagiṁchĕ
raṁgagu śhrī veṁkaḍeśhuradiveḽanu
muṁgiḍa sĕli sĕmaḍamuṁgāru lavĕmuṁchĕ
aṁgajasāmulaseda nalasinaveḽanu