ఇందాఁకా విరహమున యింతి బడలివుండెను
(॥పల్లవి॥)
ఇందాఁకా విరహమున యింతి బడలివుండెను
కందువ వలపుదేర కౌఁగిలించవయ్యా
(॥ఇందాఁకా॥)
మంచముమీఁదనుండి మఱి నీవు రాఁగా లేచి
నించి సెలవిని నవ్వె నీ నెలఁత
అంచెల నీ వందుకు నావవెట్టినా మానదు
కొంచక వేగమే వచ్చి కూచుండవయ్యా
(॥ఇందాఁకా॥)
వుద్దాలతో నిలుచుండి వూడఁ జిమ్మె నిన్నుఁ గని
వొద్దికతో తల వంచుకున్నదే చెలి
గద్దించి నీ వంతలోన కదిసి మెట్టు మనిన
వొద్దని నాపెపాదాల నొనరింపించవయ్యా
(॥ఇందాఁకా॥)
ముందరనినుఁ గని తమ్ముల ముమిసి తా మొక్కె
చెందె నలమేలుమంగ శ్రీవేంకటేశ
అందుకు మారుకు మారు అట్టె బాగాలు నీ విచ్చి
మందలించి ఆకు నీవు మడిచి యియ్యవయ్యా
(||pallavi||)
iṁdām̐kā virahamuna yiṁti baḍalivuṁḍĕnu
kaṁduva valabudera kaum̐giliṁchavayyā
(||iṁdām̐kā||)
maṁchamumīm̐danuṁḍi maṟi nīvu rām̐gā lesi
niṁchi sĕlavini navvĕ nī nĕlam̐ta
aṁchĕla nī vaṁdugu nāvavĕṭṭinā mānadu
kŏṁchaga vegame vachchi kūsuṁḍavayyā
(||iṁdām̐kā||)
vuddālado nilusuṁḍi vūḍam̐ jimmĕ ninnum̐ gani
vŏddigado tala vaṁchugunnade sĕli
gaddiṁchi nī vaṁtalona kadisi mĕṭṭu manina
vŏddani nābĕbādāla nŏnariṁpiṁchavayyā
(||iṁdām̐kā||)
muṁdaraninum̐ gani tammula mumisi tā mŏkkĕ
sĕṁdĕ nalamelumaṁga śhrīveṁkaḍeśha
aṁdugu mārugu māru aṭṭĕ bāgālu nī vichchi
maṁdaliṁchi āgu nīvu maḍisi yiyyavayyā