ఇందాఁకా వెదకితివి యిదె నీ విభుఁడు వచ్చె
(॥పల్లవి॥)
ఇందాఁకా వెదకితివి యిదె నీ విభుఁడు వచ్చె
పొందుల కోరికె లింత పోగువోయ నేఁటికే
(॥ఇందాఁ॥)
వెక్కసపు నవ్వులనే వెన్నెలగా ఇంచవే
చెక్కిటిచేతి చింతల చీకు దవ్వక
పక్కన వయోమదానఁ బదను లెక్కించవే
యెక్కువ విరహముల యెండగాయ నేఁటికే
(॥ఇందాఁ॥)
చెలువంపు మాటల చిలుకలఁ బిలువవే
కలఁక నిట్టూర్పు గాలి రేఁచక
కలువ కనుచూపులఁ జలువలు చల్లవే
తలపోఁత వుమ్మదాల దైవార నేఁటికే
(॥ఇందాఁ॥)
వున్నతి నీమోవెత్తి చంద్రోదయము గావించవే
చిన్ని మోవి చుక్కలకై సిగ్గువడక
నిన్నుఁ గూడె శ్రీ వేంకట నిలయుఁ డింతటిలోనె
సన్నిల సంతోసాలు సందడించ నేఁటికే
(||pallavi||)
iṁdām̐kā vĕdagidivi yidĕ nī vibhum̐ḍu vachchĕ
pŏṁdula korigĕ liṁta poguvoya nem̐ṭige
(||iṁdām̐||)
vĕkkasabu navvulane vĕnnĕlagā iṁchave
sĕkkiḍisedi siṁtala sīgu davvaga
pakkana vayomadānam̐ badanu lĕkkiṁchave
yĕkkuva virahamula yĕṁḍagāya nem̐ṭige
(||iṁdām̐||)
sĕluvaṁpu māḍala silugalam̐ biluvave
kalam̐ka niṭṭūrbu gāli rem̐saga
kaluva kanusūbulam̐ jaluvalu sallave
talabom̐ta vummadāla daivāra nem̐ṭige
(||iṁdām̐||)
vunnadi nīmovĕtti saṁdrodayamu gāviṁchave
sinni movi sukkalagai sigguvaḍaga
ninnum̐ gūḍĕ śhrī veṁkaḍa nilayum̐ ḍiṁtaḍilonĕ
sannila saṁtosālu saṁdaḍiṁcha nem̐ṭige