Imdaamkaa vaagidane yedurusoosidi neegu

ఇందాఁకా వాకిటనే యెదురుచూచితి నీకు
Language

(॥పల్లవి॥)
ఇందాఁకా వాకిటనే యెదురుచూచితి నీకు
కందువతో నేఁడు ననుఁ గడు మన్నించితివి

(॥ఇందాఁ॥)
సేసిన నావిన్నపాలు చిత్తానఁ బట్టెనా నీకు
ఆసుద్దులెల్లా నితవాయనా నీకు
పోసరించి నాపై దయపుట్టెనా యిప్పడు నీకు
ఆసతో నాయింటికి రా నవధరించితివి

(॥ఇందాఁ॥)
సారె నంపిన లేకలు చదువుకొంటివా నీవు
కోరి నీమాఁట దలఁచుకొంటివా నీవు
తేరకొన నావలపు తెలిసితివా నీవు
ఆరీతి నాయింటికి రా నవధరించితివి

(॥ఇందాఁ॥)
కొంకక నేనుండేచోటు గురుతెరిఁగితివా
లంకై నాతోఁ గూడఁ గలలు గంటివా
పొంకమై శ్రీవేంకటేశ పొంచి నన్నేలి దినమూ
నంకెల నాయింటికి రా నవధరించితివి

(||pallavi||)
iṁdām̐kā vāgiḍane yĕdurusūsidi nīgu
kaṁduvado nem̐ḍu nanum̐ gaḍu manniṁchidivi

(||iṁdām̐||)
sesina nāvinnabālu sittānam̐ baṭṭĕnā nīgu
āsuddulĕllā nidavāyanā nīgu
posariṁchi nābai dayabuṭṭĕnā yippaḍu nīgu
āsado nāyiṁṭigi rā navadhariṁchidivi

(||iṁdām̐||)
sārĕ naṁpina legalu saduvugŏṁṭivā nīvu
kori nīmām̐ṭa dalam̐sugŏṁṭivā nīvu
teragŏna nāvalabu tĕlisidivā nīvu
ārīdi nāyiṁṭigi rā navadhariṁchidivi

(||iṁdām̐||)
kŏṁkaga nenuṁḍesoḍu gurudĕrim̐gidivā
laṁkai nādom̐ gūḍam̐ galalu gaṁṭivā
pŏṁkamai śhrīveṁkaḍeśha pŏṁchi nanneli dinamū
naṁkĕla nāyiṁṭigi rā navadhariṁchidivi