ఇందాఁకా సరివచ్చె నింపులెల్లాను
(॥పల్లవి॥)
ఇందాఁకా సరివచ్చె నింపులెల్లాను
కందువ నీజాడ లిఁకఁ గనుఁగొనేఁ గాని
(॥॥)
నెమ్మిఁ బెండ్లాడినదాఁకా నీచేయి మీఁదైనదాఁ కా
నమ్మిక లిచ్చితి విట్టె నాకు నీవు
దొమ్మిసతులు గూడిరి దొరతనమెక్కె నేఁడు
యెమ్మెల నీతలపోఁత లీడ నెట్టోకాని
(॥॥)
చివ్వనఁ గరఁగుదాఁకా సిగ్గులువీడినదాఁ కా
నవ్వులు నవ్వితివిగా నాతో నీవు
జవ్వనము నాకు నిండె జాణఁడవైతి విపుడు
ఇవ్వల నీపొందులెట్లా నీడేరీనో కాని
(॥॥)
కళలు రేఁగినదాఁకా కైవసమైనదాఁకా
నలుగడఁ గూడితివి నన్ను నీవు
అలమేలుమంగను నీవదె శ్రీ వేంకటేశుఁడఁ
విల నీరతు లేరీతి హెచ్చీనో కాని
(||pallavi||)
iṁdām̐kā sarivachchĕ niṁpulĕllānu
kaṁduva nījāḍa lim̐kam̐ ganum̐gŏnem̐ gāni
(||||)
nĕmmim̐ bĕṁḍlāḍinadām̐kā nīseyi mīm̐dainadām̐ kā
nammiga lichchidi viṭṭĕ nāgu nīvu
dŏmmisadulu gūḍiri dŏradanamĕkkĕ nem̐ḍu
yĕmmĕla nīdalabom̐ta līḍa nĕṭṭogāni
(||||)
sivvanam̐ garam̐gudām̐kā sigguluvīḍinadām̐ kā
navvulu navvidivigā nādo nīvu
javvanamu nāgu niṁḍĕ jāṇam̐ḍavaidi vibuḍu
ivvala nībŏṁdulĕṭlā nīḍerīno kāni
(||||)
kaḽalu rem̐ginadām̐kā kaivasamainadām̐kā
nalugaḍam̐ gūḍidivi nannu nīvu
alamelumaṁganu nīvadĕ śhrī veṁkaḍeśhum̐ḍam̐
vila nīradu lerīdi hĕchchīno kāni