Imdaamkaa raamdamtaanela saadimchevu

ఇందాఁకా రాఁడంటానేల సాదించేవు
Language

(॥పల్లవి॥)
ఇందాఁకా రాఁడంటానేల సాదించేవు
ముందుగా నీ వితనికి మోవి ఇయ్యఁగదవే

(॥ఇందా॥)
పిలువఁగఁబిలువఁగ బిగిసేవు పతితోను
చలమరితనమేలే సతికి
చెలపలచెమటలు చెక్కుల వడియఁగ
అలయుచుఁ బెనఁగీ నతనిఁ జూడఁగదె

(॥ఇందా॥)
చూడఁగఁజూడఁగ జునిగేవు తెరలోన
జాడదప్పఁగనేలే సతికి
వాడు మోముతోడ వలపులు చల్లుచు
యీడనే వున్నాఁడు తనిఁ జూడఁగదె

(॥ఇందా॥)
చెనకఁగఁజెనకఁగ శ్రీవేంకటేశునెడ
చనవియ్యకుండనేలే సతికి
తనిసి నీకాఁగిటఁ దగ నన్ను మెచ్చి మెచ్చి
యినుమడి మన్నించె నితనిఁ జూడఁగదె

(||pallavi||)
iṁdām̐kā rām̐ḍaṁṭānela sādiṁchevu
muṁdugā nī vidanigi movi iyyam̐gadave

(||iṁdā||)
piluvam̐gam̐biluvam̐ga bigisevu padidonu
salamaridanamele sadigi
sĕlabalasĕmaḍalu sĕkkula vaḍiyam̐ga
alayusum̐ bĕnam̐gī nadanim̐ jūḍam̐gadĕ

(||iṁdā||)
sūḍam̐gam̐jūḍam̐ga junigevu tĕralona
jāḍadappam̐ganele sadigi
vāḍu momudoḍa valabulu sallusu
yīḍane vunnām̐ḍu tanim̐ jūḍam̐gadĕ

(||iṁdā||)
sĕnagam̐gam̐jĕnagam̐ga śhrīveṁkaḍeśhunĕḍa
sanaviyyaguṁḍanele sadigi
tanisi nīgām̐giḍam̐ daga nannu mĕchchi mĕchchi
yinumaḍi manniṁchĕ nidanim̐ jūḍam̐gadĕ