Imdaamkaa raamdamtaa padinela dooreve

ఇందాఁకా రాఁడంటా పతినేల దూరేవే
Language

(॥పల్లవి॥)
ఇందాఁకా రాఁడంటా పతినేల దూరేవే
కందువ నెదురుకొని కాఁగిలించుకొనవే

(॥ఇందాఁ॥)
పగవారికైనాను పంతములిచ్చుట మేలు
మొగమోట మతిలోన ముంచుకొంటేను
జగడములాడినాను నగుతా నుండుట మేలు
పగటుఁ జుట్టరికము పాయరాకుండితేను

(॥ఇందాఁ॥)
కడుఁగోపినైనాను కనిపొగడుట మేలు
వడి నందుఁ బనిగొనవలసితేను
తడవవచ్చినఁ దానె తప్పించుకొనుట మేలు
వొడఁబాటు బాసలు వొనరి వుండితేను

(॥ఇందాఁ॥)
వెక్కసియైన దొరను వేఁడుకొనుటే మేలు
యెక్కడా సుకము తన కెడవైతేను
చక్కని శ్రీవేంకటేశ్వరుఁడు నిన్నిదె కూడె
మొక్కుటమేలు రతి ముచ్చటైతేను

(||pallavi||)
iṁdām̐kā rām̐ḍaṁṭā padinela dūreve
kaṁduva nĕdurugŏni kām̐giliṁchugŏnave

(||iṁdām̐||)
pagavārigainānu paṁtamulichchuḍa melu
mŏgamoḍa madilona muṁchugŏṁṭenu
jagaḍamulāḍinānu nagudā nuṁḍuḍa melu
pagaḍum̐ juṭṭarigamu pāyarāguṁḍidenu

(||iṁdām̐||)
kaḍum̐gobinainānu kanibŏgaḍuḍa melu
vaḍi naṁdum̐ banigŏnavalasidenu
taḍavavachchinam̐ dānĕ tappiṁchugŏnuḍa melu
vŏḍam̐bāḍu bāsalu vŏnari vuṁḍidenu

(||iṁdām̐||)
vĕkkasiyaina dŏranu vem̐ḍugŏnuḍe melu
yĕkkaḍā sugamu tana kĕḍavaidenu
sakkani śhrīveṁkaḍeśhvarum̐ḍu ninnidĕ kūḍĕ
mŏkkuḍamelu radi muchchaḍaidenu