Imdaamkaa raa vana vemammaa

ఇందాఁకా రా వన వేమమ్మా
Language

(॥పల్లవి॥)
ఇందాఁకా రా వన వేమమ్మా
అందెందె నవ్వేవు అతనితో నమ్మా

(॥ఇందాకా॥)
యేలినరమణుని కెన్నఁడు నలుగవు
తాలిమి నీకే తగు నమ్మా
యీలాగులనే యిచ్చక మాడేవు
మేలు మేలు నిను మెచ్చితి మమ్మా

(॥ఇందాకా॥)
దండ నున్నపతిఁ దరవులు వెట్టవు
నిండురాజసము నీ దమ్మా
వెండియు నతనికి వీడె మొసఁగితివి
కొండఁ బోలు నీగుణ మమ్మా

(॥ఇందాకా॥)
శ్రీవెంకటపతిఁ జెక్కులు నొక్కేవు
నీ వాడినవే నిజ మమ్మా
కైవసంబుగా గాఁగిటఁ గూడితి
దేవుల వతనికిఁ దెలిసితి మమ్మా

(||pallavi||)
iṁdām̐kā rā vana vemammā
aṁdĕṁdĕ navvevu adanido nammā

(||iṁdāgā||)
yelinaramaṇuni kĕnnam̐ḍu nalugavu
tālimi nīge tagu nammā
yīlāgulane yichchaga māḍevu
melu melu ninu mĕchchidi mammā

(||iṁdāgā||)
daṁḍa nunnabadim̐ daravulu vĕṭṭavu
niṁḍurājasamu nī dammā
vĕṁḍiyu nadanigi vīḍĕ mŏsam̐gidivi
kŏṁḍam̐ bolu nīguṇa mammā

(||iṁdāgā||)
śhrīvĕṁkaḍabadim̐ jĕkkulu nŏkkevu
nī vāḍinave nija mammā
kaivasaṁbugā gām̐giḍam̐ gūḍidi
devula vadanigim̐ dĕlisidi mammā