Imdaamkaa neṟumgamaidi vi suddulu

ఇందాఁకా నెఱుఁగమైతి విూ సుద్దులు
Language

(॥పల్లవి॥)
ఇందాఁకా నెఱుఁగమైతి విూ సుద్దులు
విందువలె నితనికి వేడుక లివి

(॥ఇందాకా॥)
కప్పురకాపు చాతేరు కడఁగి యీ దేవునిపె
దెప్పర మీతనిమేను తెల్ల బారదా
చెప్పఁగ నవ్వు నితఁడు శ్వేతద్వీపాననుండే
యప్పటి గురుతులకు నమరు నిధి

(॥ఇందాకా॥)
యేలే తట్టుపుణుఁగు యీతనిపై నించేరు
వాలి మబ్బులు కవిశీ వన్నె మేనను
ఔలే చీఁకటితప్పుఅల్ల రేపల్లెవాడల
ఆలరై చేసేనాఁటి కమరు నిది

(॥ఇందాకా॥)
అలమేలుమంగఁ దెచ్చి అరతఁ గట్టే రితని
కెలమి మే నెల్ల సొమ్ము లిరవాయను
బలిమి శ్రీవేంకటాద్రిపతి యీతఁడు గనక
చెలఁగి సింగారములు చెల్లు నమ్మా యీప్పుడూ

(||pallavi||)
iṁdām̐kā nĕṟum̐gamaidi viూ suddulu
viṁduvalĕ nidanigi veḍuga livi

(||iṁdāgā||)
kappuragābu sāderu kaḍam̐gi yī devunibĕ
dĕppara mīdanimenu tĕlla bāradā
sĕppam̐ga navvu nidam̐ḍu śhvedadvībānanuṁḍe
yappaḍi gurudulagu namaru nidhi

(||iṁdāgā||)
yele taṭṭubuṇum̐gu yīdanibai niṁcheru
vāli mabbulu kaviśhī vannĕ menanu
aule sīm̐kaḍidappualla reballĕvāḍala
ālarai sesenām̐ṭi kamaru nidi

(||iṁdāgā||)
alamelumaṁgam̐ dĕchchi aradam̐ gaṭṭe ridani
kĕlami me nĕlla sŏmmu liravāyanu
balimi śhrīveṁkaḍādribadi yīdam̐ḍu ganaga
sĕlam̐gi siṁgāramulu sĕllu nammā yīppuḍū