Imdaamkaa neṟamgavaa yimdaravadda numdedi

ఇందాఁకా నెఱఁగవా యిందరవద్ద నుండేది
Language

(॥పల్లవి॥)
ఇందాఁకా నెఱఁగవా యిందరవద్ద నుండేది
సందడి నింతటిలోనే సటలేల సేసేవు

(॥ఇందాఁ॥)
కంకణము గట్టితివి కలికి శిరసుమీఁద
బింకముతో శాసలూనఁ బెట్టితివి
అంకెల గుబ్బలమీఁదిహరములు దిద్దితివి
యింక మమ్ముఁ జూచి సిగ్గులేల పడేవయ్యా

(॥ఇందాఁ॥)
ప్రేమ మోము చూచితివి పెండ్లికొడుకవైతివి
దోమటి దొడికితివి దొరతనాన
ఆముకొని వొకరొక రంగము లంటుకొంటిరి
చేముంచి మమ్ముఁ జూచేల సిగ్గువడేవయ్యా

(॥ఇందాఁ॥)
పానువుపైఁ గూచుంటిరి బాగా లందుకొంటిరి
పని తెరలో నిందాఁక భోగించితిరి
కానుకలు నేమియ్యఁగా గక్కన శ్రీవేంకటేశ
చే నందుకొంటా నేల సిగ్గువడేవయ్యా

(||pallavi||)
iṁdām̐kā nĕṟam̐gavā yiṁdaravadda nuṁḍedi
saṁdaḍi niṁtaḍilone saḍalela sesevu

(||iṁdām̐||)
kaṁkaṇamu gaṭṭidivi kaligi śhirasumīm̐da
biṁkamudo śhāsalūnam̐ bĕṭṭidivi
aṁkĕla gubbalamīm̐diharamulu diddidivi
yiṁka mammum̐ jūsi siggulela paḍevayyā

(||iṁdām̐||)
prema momu sūsidivi pĕṁḍligŏḍugavaidivi
domaḍi dŏḍigidivi dŏradanāna
āmugŏni vŏgarŏga raṁgamu laṁṭugŏṁṭiri
semuṁchi mammum̐ jūsela sigguvaḍevayyā

(||iṁdām̐||)
pānuvubaim̐ gūsuṁṭiri bāgā laṁdugŏṁṭiri
pani tĕralo niṁdām̐ka bhogiṁchidiri
kānugalu nemiyyam̐gā gakkana śhrīveṁkaḍeśha
se naṁdugŏṁṭā nela sigguvaḍevayyā