ఇందాఁకా నెఱఁగనైతి నిట్టె నీ మంచితనాలు
(॥పల్లవి॥)
ఇందాఁకా నెఱఁగనైతి నిట్టె నీ మంచితనాలు
అందమాయఁ బనులయ్యా ఔదువయ్యా జాణవు
(॥ఇందాఁ॥)
చెక్కు నొక్కి వేఁడుకోఁగా చిత్తము గరఁగె నాకు
మొక్కేమయ్యా నీకు ముదమలర
మిక్కిలి బుజ్జగించఁగా మించిన కోపము దీరె
ఇక్కువకు రావయ్యా ఇందవయ్యా విడెము
(॥ఇందాఁ॥)
లాలించి కోఁగలించఁగా లలి మొక దాకిరాయ
ఆల నైతినయ్యా నీకు నన్నిటా నేను
మేలిములు నీ వాడఁగా మేలుదాననైతి నీకు
యేలుకోవయ్యా చనవియ్యవయ్యా నాకును
(॥ఇందాఁ॥)
చేవట్టి గారవించఁగా చింతలెల్లాఁ బెడఁబాసె
సేవ సేసేనయ్యా నీకు చేతులారాను
శ్రీవేంకటేశ కూడఁగా నెలవుల నవ్వువచ్చె
కైవసమై వుండువయ్యా కానీవయ్యా నమ్మితి
(||pallavi||)
iṁdām̐kā nĕṟam̐ganaidi niṭṭĕ nī maṁchidanālu
aṁdamāyam̐ banulayyā auduvayyā jāṇavu
(||iṁdām̐||)
sĕkku nŏkki vem̐ḍugom̐gā sittamu garam̐gĕ nāgu
mŏkkemayyā nīgu mudamalara
mikkili bujjagiṁcham̐gā miṁchina kobamu dīrĕ
ikkuvagu rāvayyā iṁdavayyā viḍĕmu
(||iṁdām̐||)
lāliṁchi kom̐galiṁcham̐gā lali mŏga dāgirāya
āla naidinayyā nīgu nanniḍā nenu
melimulu nī vāḍam̐gā meludānanaidi nīgu
yelugovayyā sanaviyyavayyā nāgunu
(||iṁdām̐||)
sevaṭṭi gāraviṁcham̐gā siṁtalĕllām̐ bĕḍam̐bāsĕ
seva sesenayyā nīgu sedulārānu
śhrīveṁkaḍeśha kūḍam̐gā nĕlavula navvuvachchĕ
kaivasamai vuṁḍuvayyā kānīvayyā nammidi