Imdaamkaa neṟamganaidi nimkam gabadamu ledu

ఇందాఁకా నెఱఁగనైతి నిఁకఁ గపటము లేదు
Language

(॥పల్లవి॥)
ఇందాఁకా నెఱఁగనైతి నిఁకఁ గపటము లేదు
చెంది యిట్టె నాతోడఁ జెప్పవయ్య మాఁటలు

(॥ఇందా॥)
మంతనానకు రాఁగాను మనసెల్లా నొక్కటాయ
పంతము నీ వియ్యఁగాను పాసెఁ గోపము
అంతరంగము చెప్పఁగా ననుమాన మిఁక నెంచ
రంతులుసేయక యిట్టె రావయ్య యింటికి

(॥ఇందా॥)
సరసు నీ వాడఁగా చల్లనాయ నామేను
సరుసఁ గూచుండగాఁను సమ్మతించితి
యెరవులేక నవ్వఁగా నిరవాయఁ గూరియులు
బిరుదులెల్లాఁ గంటిఁ బెట్టవయ్య విడెము

(॥ఇందా॥)
గక్కన నీవు గూడఁగా కాఁతాళము లణఁగె
మిక్కిలి మన్నించఁగాను మెచ్చితి నేను
అక్కున శ్రీవేంకటేశ అలమేలుమంగను నేను
వొక్కటై కూడితి విట్టె వుండవయ్య వొద్దను

(||pallavi||)
iṁdām̐kā nĕṟam̐ganaidi nim̐kam̐ gabaḍamu ledu
sĕṁdi yiṭṭĕ nādoḍam̐ jĕppavayya mām̐ṭalu

(||iṁdā||)
maṁtanānagu rām̐gānu manasĕllā nŏkkaḍāya
paṁtamu nī viyyam̐gānu pāsĕm̐ gobamu
aṁtaraṁgamu sĕppam̐gā nanumāna mim̐ka nĕṁcha
raṁtuluseyaga yiṭṭĕ rāvayya yiṁṭigi

(||iṁdā||)
sarasu nī vāḍam̐gā sallanāya nāmenu
sarusam̐ gūsuṁḍagām̐nu sammadiṁchidi
yĕravulega navvam̐gā niravāyam̐ gūriyulu
birudulĕllām̐ gaṁṭim̐ bĕṭṭavayya viḍĕmu

(||iṁdā||)
gakkana nīvu gūḍam̐gā kām̐tāḽamu laṇam̐gĕ
mikkili manniṁcham̐gānu mĕchchidi nenu
akkuna śhrīveṁkaḍeśha alamelumaṁganu nenu
vŏkkaḍai kūḍidi viṭṭĕ vuṁḍavayya vŏddanu