Imdaamkaa neradaaya nidivo aabe

ఇందాఁకా నేరదాయ నిదివో ఆపె
Language

(॥పల్లవి॥)
ఇందాఁకా నేరదాయ నిదివో ఆపె
సందడించీ నీవిచ్చిన సలిగెల నాపె

(॥ఇందాఁ॥)
మక్కుమాతో నీవు నేను మాటలాడేవేళనే
యెక్కువ నేక తా లాడీ నిదివో ఆపె
మక్కళించి నీవు నేను మరి నవ్వేవేళనే
అక్కరతో సరసము లాడి నాపె

(॥ఇందాఁ॥)
యిచ్చల మొకమొకాలు యిద్దరముఁ జూచేవేళ
పచ్చిగా సన్నలు సేసీ పైపై నాపె
ముచ్చటకు నే దగ్గరి మోహము చల్లేటివేళ
చెచ్చెర నీపై నొరగీ సిగ్గుదేర నాపె

(॥ఇందాఁ॥)
పట్టెమంచాన నీవు నేఁ బవ్వళించి వున్న వేళ
గుట్టుతో నిద్దిరించీ నీకొంగుపై నాపె
యిట్టె శ్రీవేంకటేశ యేమరించి కూడితివి
గట్టిగా నిన్నలమి తాఁ గరఁగీ నాపె

(||pallavi||)
iṁdām̐kā neradāya nidivo ābĕ
saṁdaḍiṁchī nīvichchina saligĕla nābĕ

(||iṁdām̐||)
makkumādo nīvu nenu māḍalāḍeveḽane
yĕkkuva nega tā lāḍī nidivo ābĕ
makkaḽiṁchi nīvu nenu mari navveveḽane
akkarado sarasamu lāḍi nābĕ

(||iṁdām̐||)
yichchala mŏgamŏgālu yiddaramum̐ jūseveḽa
pachchigā sannalu sesī paibai nābĕ
muchchaḍagu ne daggari mohamu salleḍiveḽa
sĕchchĕra nībai nŏragī siggudera nābĕ

(||iṁdām̐||)
paṭṭĕmaṁchāna nīvu nem̐ bavvaḽiṁchi vunna veḽa
guṭṭudo niddiriṁchī nīgŏṁgubai nābĕ
yiṭṭĕ śhrīveṁkaḍeśha yemariṁchi kūḍidivi
gaṭṭigā ninnalami tām̐ garam̐gī nābĕ