ఇందాఁకా నేనున్నజాడ యేమని చెప్పదునయ్యా
(॥పల్లవి॥)
ఇందాఁకా నేనున్నజాడ యేమని చెప్పదునయ్యా
కందువ నా చెమటలు కమ్మి వుప్పొంగించెను
(॥ఇందా॥)
మంచిమాట నీవాడఁగాను మనసొక్కటాయను
పెంచినకోవిలకూఁతాఁ బ్రియమాయను
మించి నీవు నవ్వఁగాను మేను చల్లనాయను
పొంచి ఇంటిలోవెన్నె లిప్పుడు చుట్టమాయను
(॥ఇందా॥)
నీవీడకు రాఁగానే నిర్మల ములాయను
ఆవేళ నావూర్పుగాలే అలపార్చెను
కైవశమై నీవు గాఁగా కాఁపురము లీడేరెను
తావుల నాకొలనిలో తామరపొందాయను
(॥ఇందా॥)
కదిసి నీ వేలఁగా నిక్కడ నిట్టే చెలఁగితి
ఇదే నాపనముతీగె లింపులాయను
అదన శ్రీవేంకటేశ అలమేల్మంగను నేను
మొదలిజవ్వనమే ముదము నొందించెను
(||pallavi||)
iṁdām̐kā nenunnajāḍa yemani sĕppadunayyā
kaṁduva nā sĕmaḍalu kammi vuppŏṁgiṁchĕnu
(||iṁdā||)
maṁchimāḍa nīvāḍam̐gānu manasŏkkaḍāyanu
pĕṁchinagovilagūm̐tām̐ briyamāyanu
miṁchi nīvu navvam̐gānu menu sallanāyanu
pŏṁchi iṁṭilovĕnnĕ lippuḍu suṭṭamāyanu
(||iṁdā||)
nīvīḍagu rām̐gāne nirmala mulāyanu
āveḽa nāvūrbugāle alabārsĕnu
kaivaśhamai nīvu gām̐gā kām̐puramu līḍerĕnu
tāvula nāgŏlanilo tāmarabŏṁdāyanu
(||iṁdā||)
kadisi nī velam̐gā nikkaḍa niṭṭe sĕlam̐gidi
ide nābanamudīgĕ liṁpulāyanu
adana śhrīveṁkaḍeśha alamelmaṁganu nenu
mŏdalijavvaname mudamu nŏṁdiṁchĕnu