Imdaamkaa nemdu vodivi yeebaadivaamdavu

ఇందాఁకా నెందు వోతివి యీపాటివాఁడవు
Language

(॥పల్లవి॥)
ఇందాఁకా నెందు వోతివి యీపాటివాఁడవు
సందడిఁ బెండ్లి నేఁడు చక్కఁబెట్టరాదుగా

(॥॥)
నాటఁగ దొరవు నాతో నవ్వితివంటా నవ్వు
బూటకాన నే గాదెఁ బోయరాదుగా
గీఁటుచు వలపు చల్లి గిరిపేవు కన్ను లిట్టె
మూటగట్టి అవి నే మూలఁబెట్టరాదుగా

(॥॥)
సాగిన సబలలోన సరసమాడితివంటా
చేగలనది వాఁటము నేయరాదుగా
తీగెల మాటలాడి తేనెలు పూసితివంటా
వేగిరించి తమకము వెళ్లఁబోయరాదుగా

(॥॥)
కరఁగి నీ విట్టె నన్నుఁ గాఁగిలించితివంటా
మరునమ్ము వాఁడిచెడ మందు లేదుగా
ఇరవై శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టె
వొరసి నిన్నిట్లాడకుండరాదుగా

(||pallavi||)
iṁdām̐kā nĕṁdu vodivi yībāḍivām̐ḍavu
saṁdaḍim̐ bĕṁḍli nem̐ḍu sakkam̐bĕṭṭarādugā

(||||)
nāḍam̐ga dŏravu nādo navvidivaṁṭā navvu
būḍagāna ne gādĕm̐ boyarādugā
gīm̐ṭusu valabu salli giribevu kannu liṭṭĕ
mūḍagaṭṭi avi ne mūlam̐bĕṭṭarādugā

(||||)
sāgina sabalalona sarasamāḍidivaṁṭā
segalanadi vām̐ṭamu neyarādugā
tīgĕla māḍalāḍi tenĕlu pūsidivaṁṭā
vegiriṁchi tamagamu vĕḽlam̐boyarādugā

(||||)
karam̐gi nī viṭṭĕ nannum̐ gām̐giliṁchidivaṁṭā
marunammu vām̐ḍisĕḍa maṁdu ledugā
iravai śhrīveṁkaḍeśha yelidivi nannu niṭṭĕ
vŏrasi ninniṭlāḍaguṁḍarādugā