Imdaamkaa nedanumde nivi yellaanu

ఇందాఁకా నేడనుండె నివి యెల్లాను
Language

(॥పల్లవి॥)
ఇందాఁకా నేడనుండె నివి యెల్లాను
యిందుముఖి నేఁడు దైవమిచ్చెఁగా నీకు

(॥ఇందా॥)
కలకల నవ్వులును కందువలమాటలును
నిలువుననే కలిగె నేఁడుగా నీకు
మొలకల సిగ్గులును మోములోని కళలును
చెలువుఁడు రాఁగానే చెల్లెఁగా నీకు

(॥ఇందా॥)
తేటల తెలిఁగన్నులు తెగుదెంపువీడేలు
నీటుమీఁదనే కలిగె నేఁడుగా నీకు
కూటపు సరసములు కొంకులేని సంతసాలు
తాటించి యాతఁడంటఁగా దక్కెఁగానీకు

(॥ఇందా॥)
చెక్కుల చెమటలును చెదరినకురులును
నిక్కిచూడఁగాఁ గలిగె నేఁడుగా నీకు
గక్కన శ్రీవేంకటాదిఘనుఁడు గాఁగిలించఁగా
యెక్కువ వీరతి తుదకెక్కెఁగా నీకు

(||pallavi||)
iṁdām̐kā neḍanuṁḍĕ nivi yĕllānu
yiṁdumukhi nem̐ḍu daivamichchĕm̐gā nīgu

(||iṁdā||)
kalagala navvulunu kaṁduvalamāḍalunu
niluvunane kaligĕ nem̐ḍugā nīgu
mŏlagala siggulunu momuloni kaḽalunu
sĕluvum̐ḍu rām̐gāne sĕllĕm̐gā nīgu

(||iṁdā||)
teḍala tĕlim̐gannulu tĕgudĕṁpuvīḍelu
nīḍumīm̐dane kaligĕ nem̐ḍugā nīgu
kūḍabu sarasamulu kŏṁkuleni saṁtasālu
tāḍiṁchi yādam̐ḍaṁṭam̐gā dakkĕm̐gānīgu

(||iṁdā||)
sĕkkula sĕmaḍalunu sĕdarinagurulunu
nikkisūḍam̐gām̐ galigĕ nem̐ḍugā nīgu
gakkana śhrīveṁkaḍādighanum̐ḍu gām̐giliṁcham̐gā
yĕkkuva vīradi tudagĕkkĕm̐gā nīgu