Imdaamkaa neda numti veraa vori

ఇందాఁకా నేడ నుంటి వేరా వోరి
Language

(॥పల్లవి॥)
ఇందాఁకా నేడ నుంటి వేరా వోరి
నిందల నీ సుద్దు లెల్లా నే నెఱుఁగనా

(॥ఇందా॥)
కవ్వ కవ నవ్వుకొంటా కన్నులు దేలించుకొంటా
అవ్వల నొక్కతె చేత నా కందు కొంటా
జవ్వనపమదముతో సంపతిలిఁసారెతిలి
యివ్వల నిప్పుడుగా మా యింటికి విచ్చేసితి

(॥ఇందా॥)
పై పయి మలసుకొంటా బంగారుపావాలు మెట్టి
చాపలోన పూవుబంతి సారెఁ దిప్పుతా
రాపుగా చెమటలతో రాజసాన వీఁగుకొంటా
యీపొద్దుగా నీవు మా యింటికి విచ్చేసితి

(॥ఇందా॥)
మీసాలా దీరుచుకొంటా మీఁదుఁ గిందుఁ జూచుకొంటా
వేసాలకు నన్ను నిట్టె వే డుకొంటాను
ఆల శ్రీవేంకటేశ అట్టే నన్నుఁ గూడితివి
యీ సిరులతోనే మా యింటికి విచ్చేసితి

(||pallavi||)
iṁdām̐kā neḍa nuṁṭi verā vori
niṁdala nī suddu lĕllā ne nĕṟum̐ganā

(||iṁdā||)
kavva kava navvugŏṁṭā kannulu deliṁchugŏṁṭā
avvala nŏkkadĕ seda nā kaṁdu kŏṁṭā
javvanabamadamudo saṁpadilim̐sārĕdili
yivvala nippuḍugā mā yiṁṭigi vichchesidi

(||iṁdā||)
pai payi malasugŏṁṭā baṁgārubāvālu mĕṭṭi
sābalona pūvubaṁti sārĕm̐ dippudā
rābugā sĕmaḍalado rājasāna vīm̐gugŏṁṭā
yībŏddugā nīvu mā yiṁṭigi vichchesidi

(||iṁdā||)
mīsālā dīrusugŏṁṭā mīm̐dum̐ giṁdum̐ jūsugŏṁṭā
vesālagu nannu niṭṭĕ ve ḍugŏṁṭānu
āla śhrīveṁkaḍeśha aṭṭe nannum̐ gūḍidivi
yī siruladone mā yiṁṭigi vichchesidi