Imdaamkaa ne norisidi nimtegaaga

ఇందాఁకా నే నోరిచితి నింతేకాక
Language

(॥పల్లవి॥)
ఇందాఁకా నే నోరిచితి నింతేకాక
మందలించకుండితేను మట్టున నుండేవా

(॥ఇందాఁ॥)
పట్టినచలము నీతోఁ బడి తాళించినఁ గాక
యిట్టె విండితే నీచిత్త మేల వచ్చును
చిట్టకపుబత్తు లెల్లాఁజేసి వేరితి నీవు
అట్టునిట్టు నించుకంతానైనా నెరిఁగితివా

(॥ఇందాఁ॥)
యెగసక్కేలకు నిన్ను నింతేసి సేసినఁగాక
జగతిలో నీ వేల చక్కనుందువు
మొగమిచ్చమాట లాడి ముందే యన్నీఁ జూచితిని
తగ వించుకంతై నా తరి నడపితివా

(॥ఇందాఁ॥)
బలిమిఁ గాఁగిట నిన్నుఁబట్టి కూడితేఁ గాక
కలసి నీవే యేల కై కోందువు
యెలమి శ్రీవేంకటేశ యిట్టె నన్నుఁ గూడితివి
వలచి యిన్నాళ్ళు నావద్దికి వచ్చితివా

(||pallavi||)
iṁdām̐kā ne norisidi niṁtegāga
maṁdaliṁchaguṁḍidenu maṭṭuna nuṁḍevā

(||iṁdām̐||)
paṭṭinasalamu nīdom̐ baḍi tāḽiṁchinam̐ gāga
yiṭṭĕ viṁḍide nīsitta mela vachchunu
siṭṭagabubattu lĕllām̐jesi veridi nīvu
aṭṭuniṭṭu niṁchugaṁtānainā nĕrim̐gidivā

(||iṁdām̐||)
yĕgasakkelagu ninnu niṁtesi sesinam̐gāga
jagadilo nī vela sakkanuṁduvu
mŏgamichchamāḍa lāḍi muṁde yannīm̐ jūsidini
taga viṁchugaṁtai nā tari naḍabidivā

(||iṁdām̐||)
balimim̐ gām̐giḍa ninnum̐baṭṭi kūḍidem̐ gāga
kalasi nīve yela kai koṁduvu
yĕlami śhrīveṁkaḍeśha yiṭṭĕ nannum̐ gūḍidivi
valasi yinnāḽḽu nāvaddigi vachchidivā