Imdaamkaa naa mamkubuddhi itlumdenu

ఇందాఁకా నా మంకుబుద్ధి ఇట్లుండెను
Language

(॥పల్లవి॥)
ఇందాఁకా నా మంకుబుద్ధి ఇట్లుండెను
కందువకు రాఁగాను కడమెల్లాఁ దీరెను

(॥ఇందా॥)
మక్కళించి మక్కళించి మాటలు నీవాడఁగాను
గక్కన నామనసెల్లఁ గరఁగె నిదె
చెక్కులు నొక్కి నొక్కి చేరి నీవే వేఁడుకోఁగా
ఇక్కువ సెలవినవ్వు లిదె వచ్చెను

(॥ఇందా॥)
చనవుసేసుక నీవు సారెసారెఁ బెనఁగఁగా
తనివిదీరనియట్టితగులాయను
కొనబుఁజూపులు చిమ్మి కొచ్చికొచ్చి చూడఁగాను
వెనకమునుపులెల్ల వింతలాయను

(॥ఇందా॥)
కాఁగిలించి కాఁగిలించి కమ్మటి నీవు గూడఁగా
మాఁగినమోవి సదమదమాయను
యేఁగి వచ్చి పెండ్లాడితి విదివో శ్రీవేంకటేశ
వీఁగనిసిగ్గులు వెల్లవిరులాయను

(||pallavi||)
iṁdām̐kā nā maṁkubuddhi iṭluṁḍĕnu
kaṁduvagu rām̐gānu kaḍamĕllām̐ dīrĕnu

(||iṁdā||)
makkaḽiṁchi makkaḽiṁchi māḍalu nīvāḍam̐gānu
gakkana nāmanasĕllam̐ garam̐gĕ nidĕ
sĕkkulu nŏkki nŏkki seri nīve vem̐ḍugom̐gā
ikkuva sĕlavinavvu lidĕ vachchĕnu

(||iṁdā||)
sanavusesuga nīvu sārĕsārĕm̐ bĕnam̐gam̐gā
tanividīraniyaṭṭidagulāyanu
kŏnabum̐jūbulu simmi kŏchchigŏchchi sūḍam̐gānu
vĕnagamunubulĕlla viṁtalāyanu

(||iṁdā||)
kām̐giliṁchi kām̐giliṁchi kammaḍi nīvu gūḍam̐gā
mām̐ginamovi sadamadamāyanu
yem̐gi vachchi pĕṁḍlāḍidi vidivo śhrīveṁkaḍeśha
vīm̐ganisiggulu vĕllavirulāyanu