ఇందాఁకా మనమెల్లా నెఱఁగము యీ కీలు
(॥పల్లవి॥)
ఇందాఁకా మనమెల్లా నెఱఁగము యీ కీలు
ముందు సరసమాడక ముచ్చట వాయదు
(॥ఇందాఁ॥)
నిక్కి విరహాననున్న నెలఁతకు పతి వచ్చి
చెక్కులు నొక్కినఁగాని సేద దేరదు
వెక్కసపుఁగాఁకల విసిగినయందుకు
చొక్కపునవ్వునఁగాని సొంపురేఁగదు
(॥ఇందాఁ॥)
ఆగడుఁదమకమున నలసినయాపెకు
తగుమోవిచ్చినఁగాని దప్పి దేరదు
చిగురుఁగోరికలచే చిక్కువడినందుకు
మొగము చూపక ప్రియములు వెలవెట్టదు
(॥ఇందాఁ॥)
రాఁగినజవ్వనికి యీరతి శ్రీవేంకటేశుఁడు
కాఁగిట నించినఁగాని కళదేరదు
పాఁగినచెమటచేత పచ్చియైనయందుకు
చేఁగదేరఁ గొసరక చిత్తము గరఁగదు
(||pallavi||)
iṁdām̐kā manamĕllā nĕṟam̐gamu yī kīlu
muṁdu sarasamāḍaga muchchaḍa vāyadu
(||iṁdām̐||)
nikki virahānanunna nĕlam̐tagu padi vachchi
sĕkkulu nŏkkinam̐gāni seda deradu
vĕkkasabum̐gām̐kala visiginayaṁdugu
sŏkkabunavvunam̐gāni sŏṁpurem̐gadu
(||iṁdām̐||)
āgaḍum̐damagamuna nalasinayābĕgu
tagumovichchinam̐gāni dappi deradu
sigurum̐gorigalase sikkuvaḍinaṁdugu
mŏgamu sūbaga priyamulu vĕlavĕṭṭadu
(||iṁdām̐||)
rām̐ginajavvanigi yīradi śhrīveṁkaḍeśhum̐ḍu
kām̐giḍa niṁchinam̐gāni kaḽaderadu
pām̐ginasĕmaḍaseda pachchiyainayaṁdugu
sem̐gaderam̐ gŏsaraga sittamu garam̐gadu