ఇందాఁకా దూరితి నిన్నేడలేని మాటలను
(॥పల్లవి॥)
ఇందాఁకా దూరితి నిన్నేడలేని మాటలను
చందమాయఁ బనులెల్లా జాణవౌదువయ్యా
(॥ఇందాఁ॥)
గక్కన నానవెట్టఁగ కపటములెల్లఁ దీరె
చెక్కునొక్కఁగా మతి సేదదేరె
చక్కనన్నుఁ జూడఁగాను సంతసములెల్లాఁ జేరె
వొక్కమనసునను నావొద్ద నుండవయ్యా
(॥ఇందాఁ॥)
తారుకాణ సేయఁగాను తప్పులన్నియునుఁ బాసె
కోరి నాతో నవ్వఁగాను కొంకుదేరెను
సారె సారెఁ బెనఁగఁగ చవులాయ పొందులెల్ల
యీరీతి నేకాలము మమ్మేలుకొనవయ్యా
(॥ఇందాఁ॥)
మచ్చికఁ గాఁగిలించఁగ మర్మములెల్లఁ గరఁగె
చెచ్చెర నీరతులను చింతదీరెను
అచ్చపు శ్రీ వేంకటేశ అన్నిటా మేలే చేరె
తచ్చనలేక మాతో తాపుకొనవయ్యా
(||pallavi||)
iṁdām̐kā dūridi ninneḍaleni māḍalanu
saṁdamāyam̐ banulĕllā jāṇavauduvayyā
(||iṁdām̐||)
gakkana nānavĕṭṭam̐ga kabaḍamulĕllam̐ dīrĕ
sĕkkunŏkkam̐gā madi sedaderĕ
sakkanannum̐ jūḍam̐gānu saṁtasamulĕllām̐ jerĕ
vŏkkamanasunanu nāvŏdda nuṁḍavayyā
(||iṁdām̐||)
tārugāṇa seyam̐gānu tappulanniyunum̐ bāsĕ
kori nādo navvam̐gānu kŏṁkuderĕnu
sārĕ sārĕm̐ bĕnam̐gam̐ga savulāya pŏṁdulĕlla
yīrīdi negālamu mammelugŏnavayyā
(||iṁdām̐||)
machchigam̐ gām̐giliṁcham̐ga marmamulĕllam̐ garam̐gĕ
sĕchchĕra nīradulanu siṁtadīrĕnu
achchabu śhrī veṁkaḍeśha anniḍā mele serĕ
tachchanalega mādo tābugŏnavayyā